ETV Bharat / sports

'బుమ్రా బౌలింగ్​ రహస్యాన్ని తెలుసుకున్నా' - bumrah pattinson

టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రిత్​ బుమ్రా బౌలింగ్​ రహస్యాన్ని తెలుసుకున్నానని చెప్పాడు ఆస్ట్రేలియా బౌలర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌. ఐపీఎల్​ 13లో అతడి ఆలోచనలను గమనించానని తెలిపాడు. కాగా, బుమ్రా కూడా తన ఆలోచనలను సంతోషంగా తనతో పంచుకున్నట్లు వెల్లడించాడు.

bumrah
బుమ్రా
author img

By

Published : Dec 6, 2020, 8:03 AM IST

బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లను టీమ్​ఇండియా పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా ఎలా సంధిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్నానని ఆస్ట్రేలియా టెస్టు బౌలర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించినప్పుడు బుమ్రా ఆలోచనలను గమనించానని అన్నాడు.

"ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ముంబయి ఫ్రాంఛైజీలో ఉన్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. అయితే ఇదంతా వెను వెంటనే జరిగింది (మలింగ దూరం, ఐపీఎల్‌ అరంగేట్రం). ఈ అనుభవం ఎంతో గొప్పగా ఉంది. ఇక బుమ్రా విషయానికొస్తే.. అతడో అత్యుత్తమ బౌలర్. అతడి ఆలోచనలను గమనించాను. అంత గొప్పగా యార్కర్లు ఎలా వేస్తున్నావని అడిగాను. బౌలింగ్‌లో తన ఆలోచనలను బుమ్రా ఎంతో సంతోషంగా పంచుకున్నాడు. ఎక్కువ ఎత్తు నుంచి, ఇతర మార్పులతో అతడు బంతులు వేస్తున్నాడు. అయితే అతడు కచ్చితమైన యార్కర్లు ఎలా వేస్తున్నాడనే ఆశ్చర్యం కలుగుతోంది. విభిన్న శైలి కూడా అతడికి సానుకూలాంశంగా మారింది. అంతేగాక అతడు బంతి బంతికి వైవిధ్యం చూపిస్తాడు"

-ప్యాటిన్సన్‌, ఆసీస్​ బౌలర్‌.

యూఏఈ వేదికగా జరిగిన 13వ సీజన్‌లో ముంబయి టైటిల్ సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్​కు పేసర్ లసిత్ మలింగ దూరమవ్వడం వల్ల ముంబయి జట్టు ప్యాటిన్సన్‌ తీసుకుంది. తన అరంగేట్ర సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడిన అతడు 11 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి :

ఇంకో వికెట్​ తీస్తే బుమ్రాతో సమంగా చాహల్

బుమ్రా, నటరాజన్​ విషయంలో సరిగ్గా ఒకేలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.