ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆసీస్ సెమీస్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ ఫీల్డింగ్ సమయంలో కంగారూ జట్టు కీలక ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ గాయపడింది. ఫలితంగా ఆమె టోర్నీకి దూరమైంది. ఈ మేరకు ఆమెకు విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించింది ఆసీస్ బోర్డు.
ఈ క్రికెటర్ 15 మంది జాబితాలో ఉంటుందని.. తుది జట్టులో మాత్రమే చోటు ఉండదని తెలిపింది. ఫలితంగా ఈ స్థానాన్ని ఎవరితోనూ భర్తీ చేయమని స్పష్టం చేసింది యాజమాన్యం.
-
Ellyse Perry has been ruled out of the remainder of the T20 World Cup after sustaining a hamstring injury against New Zealand yesterday 💔 pic.twitter.com/uT5JImJwO1
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) March 3, 2020 ." class="align-text-top noRightClick twitterSection" data="
.">Ellyse Perry has been ruled out of the remainder of the T20 World Cup after sustaining a hamstring injury against New Zealand yesterday 💔 pic.twitter.com/uT5JImJwO1
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) March 3, 2020
.Ellyse Perry has been ruled out of the remainder of the T20 World Cup after sustaining a hamstring injury against New Zealand yesterday 💔 pic.twitter.com/uT5JImJwO1
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) March 3, 2020
4 పరుగుల తేడాతో..
సోమవారం జరిగిన గ్రూప్-ఏ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 4 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. బెత్ మూనీ (60), ఎలిస్ పెర్రీ (21) రాణించారు. మెగాన్ షట్ (3/28), జార్జియా (3/17) ధాటికి ఛేదనలో న్యూజిలాండ్ 7 వికెట్లకు 151 పరుగులే చేయగలిగింది. ఒక దశలో ఆ జట్టు 8 ఓవర్లకు 53/1తో ఫర్వాలేదనిపించింది. కానీ 30 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆసీస్ బౌలర్ల ధాటికి 4 ఓవర్ల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది.
చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. 15 పరుగులే చేసిన న్యూజిలాండ్ ఓటమి పాలైంది. కేటీ మార్టిన్ (37 నాటౌట్) పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. నామమాత్రమైన మరో మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ మెగాటోర్నీలో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరాయి.
-
Your #T20WorldCup semi-finalists 🙌
— ICC (@ICC) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Who are you backing to lift the trophy? pic.twitter.com/2RSLbx1Wj1
">Your #T20WorldCup semi-finalists 🙌
— ICC (@ICC) March 2, 2020
Who are you backing to lift the trophy? pic.twitter.com/2RSLbx1Wj1Your #T20WorldCup semi-finalists 🙌
— ICC (@ICC) March 2, 2020
Who are you backing to lift the trophy? pic.twitter.com/2RSLbx1Wj1