టెస్టు సిరీస్ ఓటమికి వారిద్దరే కారణం: సిల్వర్‌వుడ్ - 59 wickets by two Indian spinners
టెస్టు సిరీస్‌లో తమ ఓటమికి భారత స్పిన్ ద్వయం అక్షర్, అశ్వినే కారణమని ఒప్పుకొన్నాడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్. నాలుగు టెస్టుల్లో వారిద్దరే 59 వికెట్లు తీశారంటే.. వారి ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపాడు. ఈ ఓటమి కొంత కాలం తమని బాధిస్తుందని పేర్కొన్నాడు.
భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమిపై ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ సిల్వర్‌వుడ్ స్పందించాడు. టీమ్ఇండియా స్పిన్నర్లు అశ్విన్ (32 వికెట్లు), అక్షర్ (27 వికెట్లు)ల కారణంగానే తాము ఓడిపోయినట్లు ఒప్పుకొన్నాడు. ఈ ఓటమి కొంతకాలం తమను బాధపెడుతుందన్నాడు.
తొలి టెస్టులో భారీ గెలుపుతో సిరీస్‌ను ప్రారంభించినప్పటికీ.. అశ్విన్, అక్షర్‌ల విజృంభణతో సిరీస్‌ను కోల్పోక తప్పలేదు. వికెట్లకు నేరుగా విసిరిన బంతులకు మా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. నాలుగు టెస్టుల్లో వారిద్దరే 59 వికెట్లు తీశారు. వారెంతలా చేలరేగిపోయారో.. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వారు మా బ్యాటింగ్‌ను క్లిష్టతరం చేశారు.
-క్రిస్ సిల్వర్‌వుడ్, ఇంగ్లాండ్ ప్రధాన కోచ్.
సొంతగడ్డపై టీమ్ఇండియా అసాధారణంగా ఆడిందని క్రిస్ తెలిపాడు. "తొలి టెస్టు ఓటమి అనంతరం వారు తిరిగి గాడిలోకి వస్తారని ఊహించాం. మేం అనుకున్న దానికంటే ఎక్కువగా భారత్ రాణించింది. ఈ ఏడాది చివర్లో ఉన్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఈ ఓటమి మాకొక గుణపాఠం. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటాం. సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత తేలికైన విషయం కాదు" అని సిల్వర్‌వుడ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: గ్రౌండ్‌లోనే కాదు.. ఇక్కడా ఆడుతామంటున్న క్రికెటర్లు