IND vs WI: టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. డీఆర్ఎస్లోనూ సక్సెస్ అయ్యాడు. వీటితో పాటు ఈ వన్డేలోనే కోపం కూడా చూపించాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది.
ఇంతకీ ఏం జరిగింది?
మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 176 పరుగులు చేసింది. ఈ జట్టు అంతకంటే తక్కువ పరుగులు చేయాల్సింది కానీ హోల్డర్ హాఫ్ సెంచరీ చేయడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది.
అయితే ఇన్నింగ్స్ 32వ ఓవర్లో చాహల్ బౌలింగ్ హోల్డర్.. డీప్ మిడ్ వికెట్ మీదుగా హిట్ చేశాడు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ తడబడేసరికి, ఆ బంతి కాస్త బౌండరీ అవతల పడింది. అదికాస్త సిక్స్ అయింది. దీంతో కోపం పట్టలేకపోయిన రోహిత్.. ప్రసిద్ధ్‌పై అరిచేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 176 పరుగులు చేయగా, భారత్ దానిని 28 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకునే బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ మరోసారి తక్కువ పరుగులే చేసి, ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.
ఇవీ చదవండి: