ETV Bharat / sports

టీమ్​ఇండియాలో మరో కీలక మార్పు.. డబ్ల్యూటీసీ ఫైనల్​ నుంచి అమల్లోకి.. - BCCI deals with Adidas

బీసీసీఐకి మరోసారి కాసుల పంట పండనున్నట్లు తెలిసింది. ఎందుకంటే బోర్డు ఓ కీలక డీల్​ను ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం అందింది.

Teamindia new Jersy
టీమ్​ఇండియాలో మరో కీలక మార్పు.. డబ్ల్యూటీసీ ఫైనల్​ నుంచి అమల్లోకి..
author img

By

Published : Feb 21, 2023, 6:39 PM IST

టీమ్​ఇండియా జెర్సీ మరోసారి మారబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ.. క్రీడా పరికరాలు, దుస్తులు విక్రయించే ప్రఖ్యాత యూరోప్‌ బ్రాం‍డ్‌ అడిడాస్​తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో త్వరలోనే భారత ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం.

కాగా 2016-2020 నైక్​ సంస్థ టీమ్​ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత రూ.370 కోట్లతో ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ హక్కులను దక్కించుకుంది. కానీ 2023, డిసెంబర్‌ వరకు హక్కులు ఉన్నప్పటికీ మధ్యలోనే గుడ్​ బై చెప్పేసింది. దీంతో కిల్లర్‌ జీన్స్‌ సీన్​లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఈ సంస్థ బంగ్లాదేశ్‌ సిరీస్‌ నుంచి కిట్‌ స్పాన్సర్​గా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కిల్లర్​ జీన్స్​.. ఒప్పందం పూర్తైన తర్వాత ప్రముఖ బ్రాండ్‌ అడిడాస్‌తో డీల్​ కుదుర్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం అందింది. ఈ డీల్​ వల్ల బీసీసీఐకి కాసుల పంట కురిసే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్‌ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంటే జూన్‌ 7 నుంచి జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో రోహిత్‌ సేన అడిడాస్‌ జెర్సీలో దర్శనమివ్వనుంది. కాగా ఇప్పటికే ఐపీఎల్‌ టీమ్​ ముంబయి ఇండియన్స్‌ సహా ఇంగ్లాండ్​ ‍క్రికెట్‌ టీమ్‌కు అడిడాస్‌ జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం టీమ్‌ఇండియా ప్లేయర్స్​ రోహిత్‌ శర్మ, కుల్‌దీప్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ ఈ బ్రాండ్‌ ప్రచారకర్తలుగా కొనసాగుతున్నారు. అయితే ఈ అడిడాస్​ సంస్థ.. ప్రస్తుతం నాటింగ్‌హామ్‌ షైర్‌, సౌత్‌ ఈస్ట్‌ స్టార్స్‌, సర్రే టీమ్స్​కు జెర్సీ స్పాన్సర్లుగా వ్యవహరిస్తోంది.

ఇకపోతే బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​లో.. తొలి రెండు మ్యాచుల్లో టీమ్​ఇండియానే విజయం సాధించింది. ప్రస్తుతం 2-0తేడాతో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్​ మార్చి 1నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: 'కోహ్లీ ఎప్పుడూ సూపరే'.. అతడు చేసిన పనికి ఫ్యాన్స్​ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.