ETV Bharat / sports

Ashesh 2021: ఇంగ్లాండ్​కు షాక్.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం

James Anderson Ashes 2021: యాషెస్ సిరీస్​కు ముందు ఇంగ్లాండ్​ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. పిక్క కండరాల గాయంతో ఆ జట్టు సీనియర్ పేసర్ అండర్సన్ తొలి టెస్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.

James Anderson ruled out from Ashes, James Anderson news, అండర్సన్ లేటెస్ట్ న్యూస్, అండర్సన్ యాషెస్​కు దూరం
James Anderson
author img

By

Published : Dec 7, 2021, 10:58 AM IST

Updated : Dec 7, 2021, 11:27 AM IST

James Anderson Ashes 2021: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్​కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. పిక్క కండరాల గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్​ గబ్బాలో జరగబోయే తొలి టెస్టుకు దురమైనట్లు తెలుస్తోంది. 2019లో జరిగిన యాషెస్​లోనూ ఇదే గాయంతో పూర్తి టోర్నీ నుంచి వైదొలిగాడు జిమ్మీ. ఇతడి స్థానంలో మరో పేసర్ క్రిస్ వోక్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ సిరీస్​లో భాగంగా రెండు డేనైట్ టెస్టులు జరగనున్నాయి. ఇందుకోసం అండర్సన్ ఫిట్​గా ఉండటం అవసరమని భావించిన యాజమాన్యం తొలి టెస్టుకు అతడికి విశ్రాంతినివ్వాలని చూస్తోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు వరకు ఇతడు కోలుకునే వీలుంటుందని భావిస్తోంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు జరగనుంది.

గాయం కాలేదు.. విశ్రాంతి మాత్రమే!

ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాస్ బట్లర్.. అండర్సన్​ ఫిట్​గా ఉన్నాడని తెలిపాడు. సుదీర్ఘ సిరీస్​ దృష్ట్యా తొలి టెస్టుకు విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

ఇవీ చూడండి: 'కోహ్లీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు'

Last Updated : Dec 7, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.