Anderson on Root comments: యాషెస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఓడిపోయింది. అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టులో చివరి వరకు పోరాడి పరాజయంపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తమ బౌలర్లు సరైన విధంగా బౌలింగ్ చేయలేదని మాట్లాడాడు ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్. తాజాగా ఈ విషయంపై స్పందించిన స్టార్ పేసర్ అండర్సన్.. బ్యాటర్లపై నిందలు వేశాడు.
"అడిలైడ్ లాంటి ఫ్లాట్ పిచ్‌పై మా బ్యాటర్లు సరైన విధంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఏ బౌలర్ అయినా మంచి లెంగ్త్‌లోనే బౌలింగ్ చేయాలని అనుకుంటాడు. తొలి రెండు రోజులు మేము మా శాయశక్తులా గొప్ప బంతుల్ని వేయడానికి ప్రయత్నించాం. కొన్నిసార్లు బంతులు సరైన స్థానంలో పడలేదు. జట్టుగా మరింత క్రియాశీలకంగా ఆడాల్సి ఉంది. ఓటమికి కేవలం బౌలర్లను నిందించడం సరికాదు."
-అండర్సన్, ఇంగ్లాండ్ పేసర్
Ashes 2021: అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌పై 275 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఇంగ్లీష్ బ్యాటర్లలో రూట్, మలన్ తప్ప ఎవ్వరూ గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మెల్బోర్న్ వేదికగా ఈనెల 26న ప్రారంభవుతుంది.