Akash Chopra on Ajinkya Rahane: టీమ్ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్‌ను జట్టు యాజమాన్యం వైస్ కెప్టెన్‌గా నియమించింది. దీంతో ఇన్ని రోజులూ ఆ బాధ్యతలు చేపట్టిన అజింక్యా రహానెపై ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు.
"దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రోహిత్ గాయపడటం వల్ల.. అతడి స్థానంలో రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. రోహిత్ ఇటీవలే పూర్తిగా పరిమిత ఓవర్ల సారథ్యం చేపట్టాడు. రాహుల్ క్లిక్ అయితే, టెస్టుల్లో అజింక్యా రహానే స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. అజింక్యా గతంలో కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానూ చేశాడు. అలాంటిది ఇప్పుడు వైస్ కెప్టెన్‌గానూ చోటు కోల్పోయాడు. దీంతో టీమ్‌ఇండియాలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు."
-ఆకాశ్ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
IND vs SA Series: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది టీమ్ఇండియా. ఈ టూర్లో మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడనుంది. టెస్టు జట్టుకు కోహ్లీ సారథ్యం వహిస్తుండగా.. వన్డే ఫార్మాట్‌కు రోహిత్ శర్మను సారథిగా ప్రకటించింది బీసీసీఐ. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన హిట్‌మ్యాన్.. వన్డే సిరీస్ వరకు జట్టుతో కలిసే అవకాశం ఉంది.