'బిగ్‌బాస్' హౌస్‌లో(Bigg Boss 5 Telugu) ఈ వారం నామినేషన్స్ సందర్భంగా పెద్ద చర్చ, కాదు.. కాదు.. రచ్చ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రియ, లహరి, రవిల మధ్య(Bigg Boss Telugu Latest News) మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 'నువ్వు ఇంటిలోని ఇతర మెన్స్‌తో బిజీగా ఉంటున్నావు. రెస్ట్ రూమ్ వద్ద రవిని హగ్ చేసుకున్నావు' అంటూ ప్రియ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో లహరి, రవిలు ప్రియపై విరుచుకుపడ్డారు. ప్రియ చేసిన వ్యాఖ్యల పట్ల హౌస్‌మేట్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై షో వ్యాఖ్యాత నాగార్జున ఎలా క్లాస్ తీసుకుంటున్నారన్న ఆసక్తి నెలకొంది. తాజాగా శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను(Bigg Boss Telugu Latest Promo) విడుదల చేశారు.
హౌస్‌మేట్స్ పేర్లు రాసి ఉంచిన టైల్స్‌ను నాగార్జున ఎదుట ఉంచగా, రవి, ప్రియ పేర్లు రాసిన టైల్స్‌ను నాగ్ సుత్తితో బద్దలు కొట్టారు. 'హగ్ ఇవ్వడం బిజీగా ఉండటమా' అంటూ ప్రియను కాస్త తీవ్రంగానే ప్రశ్నించారు. 'సింగిల్ మెన్' అని నువ్వు అన్నావా? లేదా?' అని రవిని నిలదీయగా, 'ఒప్పుకొన్నా' అంటూ రవి చెప్పగా, 'లేదు సర్' అంటూ ప్రియ సమాధానం ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో బాధితురాలైన లహరిని పవర్ రూమ్‌లోకి పంపి, అసలు ఏం జరిగిందో నాగార్జున స్క్రీన్‌పై చూపించారు. ఆ తర్వాత 'ఎవరిది తప్పు కాదో వాళ్లను హగ్ చేసుకో. తప్పు చేశారన్న వాళ్లను అక్కడ నిలదీసి అడుగు' అంటూ లహరికి నాగార్జున సూచించారు. ఇంతకీ తప్పు చేసింది ఎవరు? లహరి ఎవరిని హగ్ చేసుకుంటుంది? దోషిగా ఎవరు నిలబడనున్నారు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: