ETV Bharat / sitara

'వరల్డ్‌ కాజలిజం డే'.. నెట్టింట ఫ్యాన్స్ సందడి - లక్ష్మీ కల్యాణం

అందాల చందమామ, హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​కు తన అభిమానులు ఓ రోజును కానుకగా ఇచ్చారు. 'ఏంటి.. క్యాలెండర్‌లోని ఒకరోజును కానుకగా ఎలా ఇస్తారు?' అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, నిజంగానే ఇచ్చారండి బాబూ.. ఈరోజు డిసెంబరు 20వ తేదీని 'వరల్డ్‌ కాజలిజం డే'గా ఆమె అభిమానులు ఘనంగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. మరి ఇలా ఈరోజును ప్రత్యేక రోజుగా ఏర్పాటు చేసుకోవడం వెనకున్న కారణమేంటో తెలుసా?

world Kajalism day celebrations by heroine kajal agarwal fans
'వరల్డ్‌ కాజలిజం డే' వేడుకల్లో 'చందమామ' ఫ్యాన్స్​
author img

By

Published : Dec 20, 2020, 3:32 PM IST

కథానాయకుల విషయంలో అభిమానుల మధ్య కోల్డ్ వార్స్‌ ఉంటాయేమో కానీ, కథానాయికల విషయంలో ఇది అరుదుగానే కనిపిస్తుంటుంది. ఎందుకంటే అందచందాలతో అలరించే ఏ తళుకు తారనైనా భద్రంగా మదిలో దాచేసుకుంటారు సినీప్రియులు. ప్రాంతీయ, భాషా భేదభిప్రాయాలు పక్కకు నెట్టి మరీ ఆ సొగసుల చిన్నదాన్ని తమ హృదయపు కోవెలలో కలల రాణిలా కొలువు దీర్చుకుని మురిసిపోతుంటారు. దశాబ్దంన్నరకు పైగా వెండితెరపై వెలుగులు చిందిస్తున్న కాజల్‌ అగర్వాల్‌కూ ఇలాంటి గొప్ప అభిమాన గణమే ఉంది.

world Kajalism day celebrations by heroine kajal agarwal fans
వరల్డ్‌ కాజలిజం డే

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో నిత్యం కాజల్​ను అనుసరించేవాళ్లు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరూ కలిసి డిసెంబరు 20వ తేదీని 'వరల్డ్‌ కాజలిజం డే'గా ఘనంగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్‌తో అటు ఇన్‌స్టాగ్రామ్, ఇటు ట్విట్టర్​లో వేలాదిగా పోస్ట్‌లు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు ఈరోజును పురస్కరించుకుని కాజల్ ఫొటోతో ఓ కామన్‌ డీపీని కూడా రెడీ చేసుకున్నారు. కొన్ని చోట్లయితే ఏకంగా ఈ చందమామ పేరు మీదుగా అన్నదానాలు, పాలాభిషేకాలు వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ 'కాజలిజం డే' సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది.

ఈరోజే ఎందుకంటే..!

కాజల్‌ పేరు మీదుగా ఆమె అభిమానులు ఈరోజును ఓ ప్రత్యేక రోజుగా ఏర్పాటు చేసుకోవడం వెనకున్న కారణమేంటో తెలుసా. నిజానికి ఇది కాజల్‌ పుట్టినరోజు కూడా కాదు. అలాగని ఆమె తొలిసారి తెరపై మెరిసిన తేదీ అంతకన్నా కాదు. మరి ఇంకేమై ఉంటుంది అనుకుంటున్నారా?. మరేం లేదండి.. ఈరోజు కాజల్‌ మాతృమూర్తి సుమన్‌ అగర్వాల్‌ పుట్టినరోజు. తమకు చందమామ లాంటి ఓ చక్కటి అందాల సుందరిని కానుకగా ఇచ్చినందుకుగానూ ఆమె పుట్టినరోజును ఇలా 'వరల్డ్‌ కాజలిజం డే'గా జరుపుకొంటున్నారు అభిమానులు.

కాజల్​ అగర్వాల్

'లక్ష్మీ కల్యాణం'తో మొదలైన కాజల్​‌ సినీ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న ఈ భామ.. అక్టోబరు 30న ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో ఏడడుగులేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.