బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్(katrina kaif vicky kaushal marriage) పెళ్లి వచ్చే నెలలో జరగనుందని కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. పెళ్లి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట!(katrina kaif vicky kaushal wedding) వీరి వివాహ వేడుకకు రాజస్థాన్‌లోని 700ఏళ్ల చరిత్ర ఉన్న సిక్స్ సెన్సస్ బర్వారా కోట వేదిక కానుందని తెలుస్తోంది. కాగా, తన పెళ్లిలో కత్రిన చేతికి పెట్టుకునే గోరింటాకు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే రాజస్థాన్‌లోని ఓ ప్రాంతం నుంచి దీనిని ప్రత్యేకంగా తెప్పించుకుందట. దాదాపు 20కేజీల గోరింటాకు పౌడర్ సహా 400 మెహందీ కోన్స్‌ను ఆర్డర్ చేసిందని తెలిసింది. గతంలో స్టార్ హీరోయిన్లు ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా కూడా తమ పెళ్లికి అక్కడి నుంచే ఈ గోరింటాకు తెప్పించుకున్నారు(sojat mehandi rajasthan). ప్రస్తుతం దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ మెహందీ ఎందుకింత స్పెషలో తెలుసుకుందామా?
పండగ, శుభకార్యాల్లో.. ఆడపిల్లల చేతికి అందాలను అద్దుతుంది గోరింటాకు. అంతగా మహిళల జీవితాలకు ముడిపడి, వారి మనసును దోచుకుంటుంది. దీనికి దాదాపుగా వందేళ్ల నుంచీ రాజస్థాన్‌లో ఎంతో గుర్తింపు ఉంది. పండించే విధానం నుంచి సంప్రదాయపు డిజైన్ల వరకు దీనికున్న ప్రత్యేకతే ఇందుకు కారణం.
100దేశాలకు ఎగుమతి
రాజస్థాన్‌లో తరతరాల నుంచీ మెహందీని పండిస్తున్నారు. అక్కడి సోజత్ ప్రాంతం ఈ పంటకు ప్రసిద్ధి(sojat mehandi rajasthan). ఈ ప్రాంతం నుంచి ఎన్నో వేల టన్నుల గోరింటాకు పొడి దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ ప్రాంతంలోని వాతావరణం, వర్షపాతం, మట్టి అన్నీ గోరింటాకుకు ప్రత్యేకమైన వర్ణాన్ని అందించడం వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందిందంటారు అక్కడివారంతా.
అంతేకాదు, సాధారణంగా ఎర్రగా పండటానికి బెంజిల్ ఆల్కహాల్ వంటి రసాయనాలు గోరింటాకులో కలుపుతారు. అయితే రాజస్థాన్ గోరింటాకు మాత్రం సహజసిద్ధమైన పద్ధతుల్లోనే పండించి ప్యాకింగ్ చేస్తుండటం వల్ల ఈ ప్రాంతం ఈ పంటకు ప్రముఖంగా నిలిచింది. అందుకే భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిందీ రాజస్థాన్ గోరింటాకు. ప్రముఖ మెహందీ డిజైనర్లు, సెలబ్రిటీలు తమకు కావాల్సిన గోరింటాకు పొడిని ఇక్కడి నుంచే ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటారు.
ఇదీ చూడండి: రహస్యంగా విక్కీ-కత్రినా కైఫ్ రోకా వేడుక!