'విరాటపర్వం' టీజర్, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గురువారం విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా, కథానాయికగా సాయిపల్లవి నటించారు.
నక్స్లైట్ నేపథ్య కథతో తీసిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి, నందితా దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 30 నుంచి థియేటర్లలో సినిమా సందడి చేయనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">