ETV Bharat / sitara

'Fast and Furious' సిరీస్​ నుంచి ఇంకా రెండు సినిమాలే

author img

By

Published : Jun 14, 2021, 7:40 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' వెబ్​ సిరీస్​ నుంచి మరో రెండు సినిమాలు మాత్రమే రానున్నాయి. ఈ విషయాన్ని అందులో నటించిన విన్ డీసిల్(Vin Diesel) స్పష్టం చేశారు.

Fast and Furious 9 movie
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9

'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'(Fast and Furious) ఫ్రాంచైజీ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఈ చిత్రాల్లో నటించిన నటులందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విన్ డీసిల్​​కు స్టార్ డమ్ తెచ్చిపెట్టడంలో ఈ చిత్రాలే కీలకంగా నిలిచాయి. త్వరలోనే 'ఎఫ్ 9' ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. కొవిడ్ పరిస్థితులు కారణంగా చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్(Trailer) సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఈ ప్రాంఛైజీలో 'ఎఫ్ 10', 'ఎఫ్ 11' చిత్రాలను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మాత్రం ఈ ఫ్రాంచైజీలో చిత్రాలు రావు అని అంటున్నారు విన్ డీసిల్.

"ప్రతి కథకు ముగింపు ఉండాల్సిందే. చాలామందికి ఇది ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఫ్రాంచైజీ చిత్రాలకు వీడ్కోలు పలకడం సరైందే. ఇవి ఎన్నో రికార్డుల్ని అది గమించాయి. అదే సమయంలో ఈ ఫ్రాంచైజీకంటూ ఒక ఆత్మ ఉంటుంది. దానికి విశ్రాంతి కావాలి" అని విన్ చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.