మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు..' చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దీపావళి కానుకగా ఆమె పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం.
ఇందులో భారతిగా విజయశాంతి నటిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్లో తెలిపాడు. చిరునవ్వుతో చీరకట్టులో ఆకట్టుకుంటోంది రాములమ్మ.
-
Introducing Lady Amitabh @vijayashanthi_m Garu as Bharathi in #SarileruNeekevvaru 😊
— Anil Ravipudi (@AnilRavipudi) October 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Can't-Wait for Sankranthi 2020 🤩
Wishing you all a Very Happy Diwali 💥@urstrulyMahesh @iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj#SarileruNeekevvaruOn12thJan pic.twitter.com/AlQlJ0ZFvR
">Introducing Lady Amitabh @vijayashanthi_m Garu as Bharathi in #SarileruNeekevvaru 😊
— Anil Ravipudi (@AnilRavipudi) October 26, 2019
Can't-Wait for Sankranthi 2020 🤩
Wishing you all a Very Happy Diwali 💥@urstrulyMahesh @iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj#SarileruNeekevvaruOn12thJan pic.twitter.com/AlQlJ0ZFvRIntroducing Lady Amitabh @vijayashanthi_m Garu as Bharathi in #SarileruNeekevvaru 😊
— Anil Ravipudi (@AnilRavipudi) October 26, 2019
Can't-Wait for Sankranthi 2020 🤩
Wishing you all a Very Happy Diwali 💥@urstrulyMahesh @iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj#SarileruNeekevvaruOn12thJan pic.twitter.com/AlQlJ0ZFvR
"లేడీ అమితాబ్ విజయశాంతి గారిని భారతిగా మీకు పరిచయం చేస్తున్నాం. సంక్రాంతి కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. అందరికి దీపావళి శుభాకాంక్షలు" -అనిల్ రావిపూడి, దర్శకుడు
ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు మహేశ్ బాబు కొత్త లుక్‌నూ విడుదల చేయనుంది చిత్రబృందం. ఇప్పటికే ఆర్మీ ఆఫిసర్ లుక్‌లో మహేశ్ ఆకట్టుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రామ్బ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబు నిర్మిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
ఇదీ చదవండి: నలుపు దుస్తుల్లో కిర్రాక్‌గా ఈషా రెబ్బ