ETV Bharat / sitara

Vicky-katrina wedding: విక్కీ-కత్రినా పెళ్లి.. అబ్బో ఎన్ని విశేషాలో? - katrina salman khan

Vicky-katrina weddingఛ విక్కీ కౌశల్-కత్రినా పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకోసం పక్కా ప్లాన్ సిద్ధమైంది. అయితే ఈ పెళ్లిలో చాలా విశేషాలు ఉన్నాయండోయ్! ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

Vicky-Katrina wedding
విక్కీ కౌశల్ కత్రినా కైఫ్
author img

By

Published : Dec 3, 2021, 2:14 PM IST

బాలీవుడ్​ స్టార్ కపుల్​ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్.. మరికొన్నిరోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు చివరిదశకు వచ్చేశాయి. ఈ సందర్భంగా పెళ్లిలో ఏర్పాట్లు, అతిథులకు నిబంధనలు తదితర విషయాల గురించే ఈ కథనం.

  1. విక్కీ-కత్రినా.. డిసెంబరు 5న నేరుగా జైపుర్​లో ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత హెలికాఫ్టర్​లో పెళ్లి వేదిక అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్​కు చేరుకుంటారు.
    Six Senses Fort Barwara resort
    సిక్స్ సెన్సెస్ ఫోర్ట్
  2. ఈ పెళ్లికి వచ్చే అతిథులకు ప్రత్యేకంగా కొన్ని కోడ్స్ ఇచ్చారు. అవి చెబితేనే ఈవెంట్​కు ఎంట్రీ దొరుకుతుందట!
  3. కబీర్​ఖాన్, కరణ్​ జోహార్, అమ్రిత్​పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ లాంటి దర్శకనిర్మాతలు.. ఈ వేడుకకు హాజరుకానున్నారు.
  4. తమ జిల్లాలో హై ఫ్రొఫైల్ పెళ్లి జరుగుతుండటం వల్ల జైపుర్ జిల్లా పరిపాలన విభాగం శుక్రవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
    Vicky-Katrina wedding
    విక్కీ కౌశల్-కత్రినా కైఫ్
  5. ఈ పెళ్లి మొత్తం నిర్వహణను ఓ ప్రముఖ ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీ తన భుజాన వేసుకుంది. వేడుకకు తగ్గ ఏర్పాట్లలో తలమునకలైంది.
  6. పెళ్లికి కావాల్సిన పూలు, డెకరేషన్, సెక్యూరిటీ, రవాణా, ఫుడ్, జంగల్ సఫారీ కోసం వేర్వేరు సంస్థలు.. బాధ్యతలు తీసుకున్నాయి.
  7. విలాసవంతమైన హోటల్​లో అత్యంత ఖరీదైన గదుల్ని పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడి కోసం బుక్​ చేశారు. విక్కీ కౌశల్.. రాజా మాన్​సింగ్ సూట్​లో, కత్రినా.. రాణి పద్మావతి సూట్​ రూమ్స్​లో బస చేయనున్నారు.
    Vicky-Katrina wedding
    హోటల్ రూమ్
  8. ఈ సూట్​లో ఒక్క రాత్రి ఉండేందుకు అయ్యే ఖర్చు రూ.7 లక్షలు. విక్కీ-కత్రినా ఉండే ఈ రూమ్స్​లో స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా ఉంటాయి. అలానే గదికి ఉండే కిటికీలు తెరిస్తే ఆరావళి పర్వతశ్రేణులు కనిపిస్తాయి.
    Vicky-Katrina wedding
    హోటల్ రూమ్
  9. విక్కీ-కత్రినా కుటుంబాలు.. ఈ విలాసవంతమైన హోటల్​లో డిసెంబరు 6 నుంచి డిసెంబరు 11 వరకు ఉంటారట.
  10. హిందూ సంప్రదాయం ప్రకారం డిసెంబరు 9న విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి జరుగుతుంది. కానీ ప్రోగ్రామ్స్ మాత్రం డిసెంబరు 4-12 తేదీల వరకు ఉంటాయి.
    Vicky-Katrina wedding
    విక్కీ కౌశల్-కత్రినా కైఫ్
  11. పెళ్లికి వచ్చే అతిథుల కోసం బయట నుంచి 100 మంది బౌన్సర్స్ వస్తారు. అలానే జైపుర్ పోలీస్ కూడా వీఐపీలకు భద్రత ఏర్పాటు చేస్తారు.
  12. విక్కీ-కత్రినాల సంగీత్ డిసెంబరు 7న జరగనుండగా, ఆ తర్వాత రోజు మెహందీ ఫంక్షన్ ఉంటుంది.
  13. మెహందీ వేడుక కోసం ఇటీవల జీఐ ట్యాగ్​ పొందిన 'సోజత్' మెహందీని ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగానే 20 కిలోల మెహందీ పొడిని ఆర్డర్ చేశారు. దీనిని 400 మెహందీ కోన్స్​లో ఉపయోగించనున్నారు.
  14. విక్కీ-కత్రినా పెళ్లి డిసెంబరు 9న జరుగుతుంది. ఆ తర్వాత రోజు అంటే డిసెంబరు 10న అతిథుల కోసం ప్రత్యేక రిసెప్షన్​ను ఏర్పాటు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.