విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నారప్ప'. తమిళ సినిమా 'అసురన్'కు రీమేక్‌గా రూపొందుతోంది. ఇప్పటికే 50 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలో వెంకీ ఇద్దరు కొడుకులకు తండ్రిగా కనిపించనున్నారు. వారిలో పెద్దవాడైన పెళ్లీడు కొచ్చిన యువకుడి పాత్రను ఈరోజు పరిచయం చేశారు.

ఈ సినిమాలో వెంకటేశ్ పెద్ద కొడుకు పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్ర కోసం 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో కార్తీక్.. ముని కన్నగా కనిపించనున్నారు. సైకిల్‌పై వెళుతున్న కార్తీక్ గెటప్ ఆకట్టుకునేలా ఉంది.