కరోనా పరిస్థితుల వల్ల తుది దశ చిత్రీకరణలో ఆగిన 'వకీల్‌సాబ్' చిత్రం మళ్లీ పట్టాలెక్కింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 26వ సినిమా ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అంజలితో పాటు మిగిలిన ముఖ్య నటీనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్ర తాజా షూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. పవన్ వచ్చే నెలలో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. ఆ షెడ్యూల్‌లోనే శ్రుతిహాసన్ పాల్గొననుంది. సంక్రాంతి లక్ష్యంగా సినిమాను ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కూర్పు: పవన్ పూడి, మాటలు: తిరు, ఛాయాగ్రహణం: పిఎస్ వినోద్.
![Vakeel Saab resumes shoot after lockdown without Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8902761_3.jpg)
![Vakeel Saab resumes shoot after lockdown without Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8902761_4.jpg)