ETV Bharat / sitara

సంక్రాంతి బరిలో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'! - వైష్ణవ్ తేజ్ ఉప్పెన

సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఉప్పెన'. పరిస్థితులు బాగుంటే ఏప్రిల్​లోనే విడుదల కావాల్సింది. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తోందట చిత్రబృందం.

సంక్రాంతి బరిలో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'!
సంక్రాంతి బరిలో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'!
author img

By

Published : Jul 18, 2020, 9:24 PM IST

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేస్తోన్న చిత్రం 'ఉప్పెన'. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్​లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు మూతపడటం వల్ల ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. దీంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం థియేటర్లకే మొగ్గుచూపింది.

ప్రస్తుత పరిస్థితులు ఎప్పటివరకు సర్దుమణుగుతాయే తెలియదు. అందువల్ల సినిమా విడుదల తేదీలపై చిత్రబృందాలు ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. అయితే 'ఉప్పెన'ను సంక్రాంతి బరిలో ఉంచాలని నిర్మాతలు భావిస్తున్నారట. కరోనా ప్రభావం అప్పటివరకు తగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కృతిశెట్టి హీరోయిన్​గా నటిస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.