తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' తర్వాత పలువురు దర్శకనిర్మాతల చూపు ఆయనపై పడింది. ఇప్పటికే ఆయన రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. అందులో ఒకటి త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ తీసిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఇప్పుడు నటించనున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వచ్చే నెల ఆరంభంలోనే ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా కేతిక శర్మ నటించే అవకాశాలున్నాయి.