దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ యువహీరోలు తమ సినిమాల్లోని పోస్టర్లు, టీజర్లు, న్యూలుక్‌ను విడుదల చేశారు. ఇందులో సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్,రాజ్‌తరుణ్, ఆది, అశ్విన్ ఉన్నారు.
'ఇద్దరి లోకం ఒకటే'...
'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన నటుడు రాజ్ తరుణ్. 'కుమారి 21ఎఫ్'తో మంచి విజయాన్ని అందుకున్నాడీ యువ నటుడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘'ఇద్దరి లోకం ఒకటే'. షాలినీపాండే కథానాయిక. జీఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం.
'రాజుగారి గది3'...
'రాజుగారి గది'లోకి అడుగుపెట్టే ధైర్యం మీకు ఉంటే... అక్టోబర్ 18న మీ దగ్గరలోని థియేటర్‌లకు రండి అంటున్నారు 'రాజుగారి గది3' చిత్రబృందం. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన తమ్ముడు అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అవికాగోర్ కథానాయిక. విజయదశమి సందర్భంగా సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. గతంలో 'రాజుగారి గది' సిరీస్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'...
'ఒక్కసారి జైహిందే మా జిహాద్ అయితే.. మీరే ఆలోచించుకోండి' అంటున్నాడు ప్రముఖ నటుడు ఆది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. సాయి కిరణ్ అడవి ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారం చేసుకొని ఈ చిత్రం తెరకెక్కింది. రచయిత అబ్బూరి రవి ఈ చిత్రంతో నటుడిగా పరిచయమవుతున్నాడు. ఎన్‌ఎస్‌జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది నటించాడు. సాషా చెత్రి, కార్తీక్‌రాజు, పార్వతీశం, నిత్యానరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'సోలో బ్రతుకే సో బెటర్'...
చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెగాహీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న ఓ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి 'సోలో బ్రతుకే సో బెటర్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసింది చిత్రబృందం. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ నుంచి ప్రారంభంకానుంది. తమన్ బాణీలు సమకూర్చనున్నాడు. దీనితో పాటు ప్రతిరోజు పండగే అనే సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరమ్‌తేజ్.
'A1 ఎక్స్‌ప్రెస్'...
'నిను వీడని నీడను నేనే' తర్వాత సందీప్ కిషన్ చేస్తోన్న చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. హాకీ క్రీడా కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను నేడు విడుదల చేసింది చిత్రబృందం.ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ దర్శకుడు. హిప్ హాప్ తమీజ సంగీతం సమకూర్చనున్నాడు. నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.