ETV Bharat / sitara

ప్రముఖ కన్నడ దర్శకుడు మృతి

అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్​ రెడ్డి (84) మరణించారు. దీంతో చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Oct 10, 2020, 10:54 AM IST

Vijaya Reddy
విజయ్​ రెడ్డి

ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్​ రెడ్డి(84) శనివారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఆంధ్రపదేశ్​కు చెందిన విజయ్​ రెడ్డి.. కన్నడ చిత్రసీమలో స్థిరపడ్డారు. కెరీర్​లో దాదాపు 40కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో 'గంధాద గుడి', 'మయుర శ్రీనివాస కల్యాణ్​, 'భక్త ప్రహ్లాద', 'సనాది అప్పణ్ణ', 'నీ నాన్న గల్లారె' వంటి హిట్​ సినిమాలు ఉన్నాయి. 2018లో డా.రాజ్​కుమార్​ సౌహార్ద అవార్డును అందుకున్నారు.

ఇదీ చూడండి 'కరోనా కాలంలో ఆ ఒక్క విషయం బాగా బాధ పెట్టింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.