ETV Bharat / sitara

సూర్య 'జై భీమ్'.. హాలీవుడ్​ సినిమాల కంటే టాప్​లో - suriya new movie

'జై భీమ్'.. సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూ, రికార్డులు సృష్టిస్తోంది. హాలీవుడ్​ సినిమాల్ని తలదన్ని టాప్ రేటింగ్​ దక్కించుకుంది.

Tamil movie Jai Bhim
జై భీమ్ మూవీ
author img

By

Published : Nov 10, 2021, 3:51 PM IST

సూర్య 'జై భీమ్‌' సినిమా రికార్డు సృష్టించింది. అమెజాన్‌ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (IMDB- Internet Movie Data Base) సినిమాల జాబితాలో టాప్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ నెల 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్‌తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అటు 97శాతం మంది గూగుల్‌ యూజర్లు ఈ చిత్రం బాగుందంటూ కొనియాడారు.

Tamil movie Jai Bhim
సూర్య జై భీమ్ మూవీ

ఐఎమ్​డీబీ రేటింగ్ ఏంటి?

ప్రపంచంలోని వివిధ భాషల్లో వచ్చిన సినిమా రివ్యూ చూసేందుకు గూగుల్‌ చేయగానే మొదట కనిపించే వాటిల్లో 'ఐఎమ్‌డీబీ' రేటింగ్‌ ఒకటి. ఇందులోని టాప్‌ రేటెడ్‌ మూవీస్‌కి ఐఎమ్‌డీబీ యూజర్లు రేటింగ్‌ ఇస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకూ తొలిస్థానంలో 1994లో విడుదలైన 'ది షాషాంక్ రిడంప్షన్‌' ఉండగా.. దాన్ని రెండో స్థానానికి నెట్టి 'జై భీమ్‌' తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సినిమా 'గాడ్‌ ఫాదర్‌' మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఓటీటీలో విడుదలైన సూర్య చిత్రం 'ఆకాశం.. నీ హద్దురా' సైతం ఐఎమ్‌డీబీ టాప్‌-10 జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు 'జై భీమ్‌'తో సూర్య ఆ హవాను కొనసాగిస్తూ తన సత్తా చాటుతున్నాడు.

రేటింగ్ వారీగా చిత్రాలు..

1. జై భీమ్‌ 9.6/10

2. ది షాషాంక్ రిడంప్షన్ 9.3/10

3. ది గాడ్‌ ఫాదర్‌ 9.2/10

4.సర్దార్‌ ఉద్దమ్‌ 9.0/10

5.ది డార్క్‌ నైట్‌ 9.0/10

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.