ETV Bharat / sitara

'సుశాంత్​కు ఆస్కార్​ గెలిచే టాలెంట్​ ఉంది' - celina jaitly sushant singh rajput updates

సుశాంత్​ రాజ్​పుత్​ ఆకస్మిక మృతికి బాలీవుడ్​ నటి సెలీనా జైట్లీ సంతాపం తెలిపారు. అతని మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా పేర్కొన్నారు. సుశాంత్​ చనిపోవడానికి మానసిక ఒత్తిడే కారణమంటున్న తరుణంలో.. ఇది ఒక వ్యాధిలాంటిదని సెలీనా వెల్లడించారు.

Sushant Singh Rajput probably would have won India's first Oscar: Celina Jaitly
'భారతీయ తొలి ఉత్తమ నటుడిగా సుశాంత్​ ఆస్కార్​ పొందేవాడు'
author img

By

Published : Jun 30, 2020, 2:39 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​కు ఉత్తమ నటుడిగా ఆస్కార్​ సొంతం చేసుకునే ప్రతిభ ఉందని బాలీవుడ్​ నటి సెలీనా జైట్లి అన్నారు. సుశాంత్​ మరణానికి సంతాపం తెలిపిన ఈమె.. సినీ పరిశ్రమ గొప్ప టాలెంట్​ను కోల్పోయిందని పేర్కొన్నారు. అతనికి అపారమైన సామర్థ్యం ఉందని ప్రశంసించారు.

"ఒక గొప్ప ప్రతిభను కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. కేవలం ఒక తండ్రి, సోదరుడు, ప్రియమైన వారికే కాకుండా, సినీ పరిశ్రమకూ తీరని నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో భారత్​ నుంచి తొలి ఆస్కార్​(ఉత్తమ నడుడిగా) గెలుచుకోదగిన అపారమైన నటనా సామర్థ్యం సుశాంత్​లో దాగి ఉంది. అది ఎప్పటికీ మీకు తెలియదు."

-సెలీనా జైట్లి, బాలీవుడ్ నటి

సుశాంత్ చనిపోవడానికి మానసిక ఒత్తిడే కారణమని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సెలీనా స్పందిస్తూ... "డిప్రెషన్​ అనేది ఒక వ్యాధి. మనం విజయాలు సాధించినా, ధనవంతులైనా, పేదవాళ్లైనా దానికి పట్టింపులేదు. నేను కూడా ఈ ఒత్తిడిని అనుభవించా. నా భర్త, వైద్యుల సాయంతో ఆ మహమ్మారి నుంచి బయటపడ్డా. ఏ వయసులోనైనా, ఏ సమయంలోనైనా ఈ వ్యాధి మనల్ని వెంటాడే అవకాశం ఉంది. ఈ రోగానికి తప్పనిసరిగా చికిత్స అవసరం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల్ని బలిగొంటుంది" అంటూ వెల్లడించారు.

ఇటీవలే 'సీజన్ గ్రీటింగ్స్'​ వెబ్​సిరీస్​తో తిరిగి నటనలో అడుగుపెట్టిన సెలీనా.. ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్త పీటర్​ హాగ్​ను వివాహం చేసుకున్నారు.

ఇదీ చూడండి:ఓటీటీలకు క్యూ కట్టిన బాలీవుడ్​.. మరి టాలీవుడ్?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.