ETV Bharat / sitara

ఇన్​స్టాగ్రామ్​లో బన్నీ హవా.. ఫాలోవర్లలో రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్​స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన రెండో టాలీవుడ్ సెలబ్రిటీగా ఘనత సాధించాడు బన్నీ.

Stylish Star Allu Arjun reaches 10 million Instagram followers
10 మిలియన్లకు బన్నీ ఇన్​స్టా ఫాలోవర్లు
author img

By

Published : Jan 7, 2021, 4:41 PM IST

Updated : Jan 7, 2021, 5:03 PM IST

దాదాపుగా ఇప్పుడు చిత్రసీమకు చెందిన నాయికానాయకులతో పాటు ఇతర తారలు కూడా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గానే ఉంటున్నారు. వారందరికంటే మన టాలీవుడ్ నటుల నుంచి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచారు. 10 మిలియన్ల ఫాలోవర్స్​ను కలిగిన మొదటి తెలుగు హీరోగా దేవరకొండ ఉండగా, ఆ తరువాత ఈ జాబితాలో రెండో సెలబ్రిటీగా నిలిచాడు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌.

మొత్తంగా బన్నీనే నెంబర్​వన్

అన్ని సామాజిక మాధ్యమాలను కలిపి చూసుకుంటే అల్లు అర్జున్ దక్షిణాదిలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇన్​స్టాలో 10 మిలియన్, ట్విట్టర్​లో 5.5 మిలియన్, ఫేస్​బుక్​లో 20 మిలియన్ల ఫాలోవర్లను కలుపుకొని మొత్తం 35 మిలియన్ల అనుచరులతో టాప్​లో ఉన్నాడు.

బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రంలో ఎర్రచందనం దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఈ మధ్యే రాజమండ్రి ప్రాంతంలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్ర షూటింగ్‌ జరుపుకొంది.

Last Updated : Jan 7, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.