ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సైరా'... విపరీతంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చింది అల్లు ఫ్యామిలీ. ఈ కార్యక్రమంలో మెగాహీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సందడి చేశారు. వీరితో పాటే హీరోలు అఖిల్, శ్రీకాంత్, దర్శకుడు సుకుమార్ తదితరులు హాజరయ్యారు.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. జూలియస్ పేకియమ్ నేపథ్య సంగీతం ప్రధానాకర్షణగా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం అబ్బురపరిచింది.
ఇవీ చదవండి: