'ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ, ఆ ప్రపంచాన్ని చూపించేది నాన్న'. ఆదివారం (జూన్ 20) ఫాదర్స్ డే(Fathers Day) సందర్భంగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sri Devi Drama Company) కార్యక్రమంలో 'నాన్నకు ప్రేమతో' అనే స్పెషల్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. ఇందులో బుల్లెట్ భాస్కర్, నూకరాజు, ఇమ్మాన్యుయేల్ తదితరులు తమ డైలాగ్‌లతో కడుపుబ్బా నవ్వించారు. 'సన్స్ యాజ్ ఫాదర్స్, ఫాదర్స్ యాస్ సన్స్' స్పెషల్ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.
మొత్తంగా ఈ కార్యక్రమం సరదాగా సాగింది. ముఖ్య అతిథిగా నటి ఇంద్రజ విచ్చేశారు. మరి ఈ హంగామా అంతా చూడాలంటే ఆదివారం(జూన్ 20) మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. అంతవరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.
ఇదీ చూడండి: 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో 'జంబలకిడి పంబ'