ETV Bharat / sitara

chandra mohan: అభినయ వేదం 'చంద్రమోహనం'

అభినయ వేదం చంద్ర మోహనం. వెండితెరపై సమ్మోహనం. ఆ నట వైదుష్యం నవరసభరితం. వైవిధ్య కథాంశాలలో ఒదిగి, శిఖరంగా ఎదిగి.. ప్రేక్షక నీరాజనాలు అందుకున్న విశిష్ట నటుడు. సుప్రసిద్ధ నటుడు, చలనచిత్ర కథానాయకుడు. అనేక పాత్రల్లో జీవించి నటనకే వన్నె తెచ్చిన విలక్షణుడు. యాభైఐదు వసంతాలకు పైగా సినీ యవనికపై మెరిసి, నటన కురిసి, విరిసి.. అభిమానులు మురిసి.. జేజేలు అందుకున్న నట విశారదుడు. చంద్రమోహనుడు.

special story about actor chandra mohan
నటుడు చంద్రమోహన్
author img

By

Published : Jun 9, 2021, 1:43 PM IST

ఆరడుగుల ఆజానుబాహుడు కాదు. మరీ సోగ్గాడూ కాదు. అయినా అగ్ర హీరోలతో పోటీపడి సమాంతరంగా కథానాయకుడుగా, రెండో హీరోగా అనేక సినిమాల్లో నటించడం చంద్రమోహన్ నట వైదుష్యానికి నిదర్శనం. అన్ని చిత్రాలలో నటించడం ప్రేక్షకుల అదృష్టం. కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, పౌరాణిక నటుడుగా నటనకు తనదైన నిర్వచనమిచ్చారు. డీగ్లామర్ పాత్రలూ పోషించి నవ్యభాష్యం చెప్పారు. అలాంటి అద్వితీయ నటుడు ఇటీవల చిత్రసీమలో 55 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

కృష్ణా జిల్లా పమిడిముక్కల అగ్రహారంలో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మల్లంపల్లి చంద్రశేఖర రావు.. చంద్రమోహన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అగ్రికల్చర్ బీఎస్సీ చదివి.. ఏలూరులో వ్యవసాయాధికారిగా ఉద్యోగం, సేద్యరంగ అధికారి ఉద్యోగం వదలి.. కళల సేద్యంవైపు దృష్టి సారించారు. ఎన్నో ఆశలతో మద్రాసు వెళ్లి కష్టాన్ని, అదృష్టాన్ని నమ్ముకుని సినీ శిఖరాలు అధిరోహించారు.

chandra mohan rangularatnam movie
రంగుల రాట్నం సినిమాలో చంద్రమోహన్

1966 రంగుల రాట్నం

ఉత్తమాభిరుచి కల సినిమాలు తీసే వాహినీ వారి 'రంగులరాట్నం' సినిమాకు ఇద్దరు హీరోలలో ఒక హీరోగా ఎంపికయ్యారు చంద్రమోహన్. జీవితం ఒక చక్రభ్రమణం. ఒక రంగుల రాట్నం. తల్లికి, ఇద్దరు బిడ్డల మధ్య సంఘర్షణ. కలహించే కుమారుల మధ్య ఐక్యతావారథిగా, ప్రేమైక సారథి పాత్రలో అంజలీదేవి నటించారు. చంద్రమోహన్ తొలి సినిమాలోనే బలమైన ముద్రవేశారు. 'వెన్నెలరేయి చందమామ వెచ్చగనున్నది మామ' పాటలో నూతన నటుడు, వాసుగా నటించిన చంద్రమోహన్‌ డప్పు వాద్యానికి అభినయించిన పద్ధతి ఆకట్టుకుంది.

వచ్చిన అవకాశమే బీఎన్ రెడ్డి సినిమాలో రావటం, దశాబ్దాలు తారాపథంలో దూసుకెళ్లి ప్రేక్షక నీరాజనాలు తర్వాత చరిత్ర. 'రంగులరాట్నం'లో మొన్నటి బాలీవుడ్ సహజ సౌందర్యరేఖ, మొన్నటి హీరోయిన్ రేఖ.. బాలనటి భానురేఖగా ఈ సినిమాలో కన్పించారు. ఇక ఆ తర్వాత వరుల చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు.

అనంతరం సుఖదుఃఖాలు, కాలం మారింది, ఓ సీతకథ, సెక్రెటరీ వరుసగా హిట్లు వచ్చాయి. 1978లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పదహారేళ్ల వయసుతో బ్లాక్​బస్టర్ అందుకున్నారు చంద్రమోహన్. ఈ సినిమాలో ఆయన ప్రదర్శించిన హావభావాలు, శారీరక భాషతో అభియయం అద్భుతం. ప్రముఖ కథానాయకుడుగా వెండితెరమీద వెలుగుతూ..డీ గ్లామర్ రోల్ లో నటించడం చంద్రమోహన్ చేసిన సాహసమేనని చెప్పవచ్చు. అదే ఏడాది సిరిసిరి మువ్వ, 1979లో ఇంటింటి రామాయణం, 1980లో శుభోదయం మంచి పేరు తీసుకొచ్చాయి.

chandra mohan vijay shanthi
చంద్రమోహన్ -విజయశాంతి

నటుడిగా చంద్రమోహన్​కు ఒక ఊపు, ఉత్సాహాన్నిచ్చిన సినిమా 'గోపాలరావుగారి అమ్మాయి'. చంద్రమోహన్ సూర్యం పాత్రలో, జయసుధ తన బాల్య నామం సుజాతతో, ఈ చిత్రంలో నటించారు. చక్రవర్తి స్వరాలలో ఎస్పీబాలసుబ్రహ్మణ్యం గళంలో 'సుజాతా ఐ లవ్ యు సుజాత' పాట నాటి యువహృదయాలలో తీయని గుబులురేపింది. ఇక రాధాకల్యాణం, మూడుముళ్లు, సుందరి సుబ్బారావు, ప్రతిఘటన, సువర్ణ సుందరి, పెళ్లిళ్ల పేరయ్య, ఆస్తులు అంతస్తులు, ఆమె, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాల్లోని పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు చంద్రమోహన్.

హీరోయిన్ల సెంటిమెంట్

సినిమా రెడీ అయ్యి హిట్ కొట్టాలన్నా సినీ రంగం భాషలకు అతీతంగా సెంటిమెంటు చుట్టూ పరిభ్రమిస్తున్నది. ఇది సెంట్ పర్సెంట్ సత్యం. సెంటిమెంటు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ సెంటిమెంట్ హీరోయిన్లకు మరీ ఎక్కువ. ఏ హీరోతో నటిస్తే తమ దశ తిరుగుతుందో వారికో లెక్కుంది. నమ్మిన లక్కుంది. 1966 తర్వాత చంద్రమోహన్​తో సినిమా చేయటం అనే సెంటిమెంట్‌ బలపడింది. ఈ ధోరణి 1980ల్లో మరీ పెరిగింది. చంద్రమోహనుడికి జోడీగా నటించిన అనేకమంది హీరోయిన్లు తారా పథంలో తారస్థాయికి దూసుకెళ్లారు. హీరోయిన్లు విశ్వసించిందీ ఇదే. 1976లో శ్రీదేవి 'అనురాగాలు' అనే సినిమాలో నటించినా ఆమెకు గుర్తింపురాలేదు. 1978లో 'పదహారేళ్ల వయసు'లో చంద్రమోహన్ సరసన కథానాయికగా చేశారు. తర్వాత గుర్తింపు కావచ్చు. యాదృచ్ఛికం కావచ్చు. శ్రీదేవికి వరుసగా 'వేటగాడు', 'జస్టిస్ చౌదరి', 'కొండవీటి సింహం', 'ప్రేమాభిషేకం', 'బొబ్బిలిపులి' లాంటి భారీ సినిమాల్లో నటించే అవకాశం లభించింది. జయప్రద 1976 లో 'సిరిసిరిమువ్వ'తో చంద్రమోహన్‌తో నటించారు. ఆ సినిమా ఆమె సినీ కెరీర్​నే మార్చివేసింది. జయసుధ 1978లో ప్రాణం ఖరీదులో చంద్రమోహన్​తో కలసి నటించారు. ఆ చిత్రం తర్వాత చిత్రంగా ఆమె వరుసగా 34 సినిమాలలో చంద్రమోహన్​తో కలసి హీరోయిన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.

విజయశాంతి తొలిసారి చంద్రమోహన్​తో 1983లో 'పెళ్లి చూపులు' నటించారు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్​లో ఉషాకిరణ్ మూవీస్​లో 'సుందరి సుబ్బారావు' 'ప్రతిఘటన'లో నటించగా.. ప్రతిఘటన బ్లాక్ బస్టర్​గా నిలిచింది. తర్వాత ఆమె తెలుగులో అగ్రహీరోలందరితో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. లేడీ సూపర్​స్టార్​గా అభిమానులు ఆమెను గౌరవించారు. చంద్రమోహన్​తో నటించిన శ్రీదేవి, జయప్రద బాలీవుడ్​లోనూ అగ్రశ్రేణి హీరోయిన్లుగా రాణించారు. టాలీవుడ్​లో జయసుధ, విజయశాంతి, రాధ, రాధిక తెలుగు చిత్రసీమ వెండితెరపై అగ్రశ్రేణి హీరోయిన్లుగా ఎదిగారు. మంజుల, ప్రభ, తాళ్లూరి రామేశ్వరి లాంటి కథానాయికలు నటించారు. అగ్రశ్రేణికి ఎదిగారని అభిమానుల విశ్వాసం. ప్రేక్షకులు అందరు హీరోయిన్లని అనేక సినిమాలలో ఆదరించడం నిజం.

actor chandra mohan
చంద్రమోహన్

ఏ పాత్రయినా అవలీలగా..

మధ్యతరగతి తండ్రి, పొదుపుగా కుటుంబాన్ని నడిపే భర్త. పెళ్లిళ్లపేరయ్య పాత్రలు చేయించాలంటే దర్శకులకు మొదట కళ్లముందు నిలిచేది చంద్రమోహన్ అని సినీ విమర్శకుల విశ్లేషణ. ఆయన మధ్యతరగతి మందహాసం. కామెడీ వేషాల దరహాసం. చిన్న రోల్‌లభించినా నిరాశ చెందని చిద్విలాసం. కుటుంబ పెద్ద. సంపదలో పేద. కానీ ఆత్మాభిమానంలో పెద్ద. ఒకటీ అరా పౌరాణిక పాత్రలు లభించినా న్యాయం చేశారు. అల్లుడు గారు సినిమా నుంచి పూర్తి స్థాయి క్యారెక్టరు ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. ఆమె, గులాబీ చిత్రాలలో తండ్రి పాత్రల్లో నటనా కౌశలాన్ని చాటుకున్నారు. అతనొక్కడే చిత్రంలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్టు లభించింది. పెళ్లి చేసుకుందాం రా!, నువ్వు నాకు నచ్చావ్! సినిమాల్లో అద్భుతమైన కామెడీ పండించారు. (పెళ్లి చేసుకుందాం రా! చిత్రంలో టీ తాగుతుంటే.. గుండు హనుమంతరావు పేపర్ కిందినుంచి విసిరివేసే సీన్ (Spot)బాధ్యత మరచి బలాదూర్​గా తిరిగే పుత్రరత్నాలను దారికి తెచ్చే తండ్రి పాత్రల్లో చంద్రమోహన్ నటన పండించారు. నువ్వేనువ్వేలో తరుణ్​కు హితబోధ చేస్తారు. అలాంటి పాత్రలు ఆయనకు టైలర్ మేడ్‌లాంటివి.

60 మంది దర్శకులతో..

దర్శకుల అంతరంగాన్ని తెరమీద చక్కగా ఆవిష్కరిస్తారని చంద్రమోహన్​కు పేరు. వారి ఊహకు అనుగుణంగా తెరమీద పాత్రలకు ప్రాణప్రతిష్ట చేస్తారని పేరు. తమిళంలో కమలహాసన్ చేసిన పాత్రలను తెలుగులో చంద్రమోహన్ చేశారు. బీఎన్ రెడ్డి దర్శకత్వంలో తొలి సినిమాలో నటించిన చంద్రమోహన్ తర్వాత కాలంలో దాదాపు 60 మంది దర్శకులతో పనిచేశారు. విశ్వనాథ్‌, ఆదుర్తి సుబ్బారావు, కె. రాఘవేంద్రరావు, విజయనిర్మల, జంధ్యాల , ఇవివి సత్యనారాయణ.. ఇంకా అనేక తరాల దర్శకుల నేతృత్వంలో పనిచేశారు.

చంద్రమోహన్ కథల హీరో

చంద్రమోహన్‌ దర్శకుల హీరో కథానాయకుల హీరో. అన్నింటికీ మించి కథల హీరో. కథలు ఆకాశం నుంచి రాలిపడవు. జీవితం నుంచే వస్తాయి. చంద్రమోహన్ ఇంకో అడుగు ఉంటేనా ఇంకా అద్భుతాలు చేసేవారని అనేకమంది అంటుంటారు. ప్రశంసో అర్ధంకాదు. అభిశంసనో అవగతం కాదు. కానీ ఆయన నిర్మాతలందరికీ అడుగు దూరంలోనే ఉన్నారు. అందుబాటులోనే ఉన్నారు. ఎంత ఎదిగినా వినయంతో ఒదిగే ఉన్నారు. కమర్షియల్, కుటుంబ కథా చిత్రాలు, కామెడీ సినిమాలు.. ఏ విభాగ చిత్రాలయినా అవలీలగా తన పాత్రలను రక్తికట్టించారు. వెండితెరతో ఆయనది జన్మజన్మల బంధం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.