ETV Bharat / sitara

ఐసీయూలో ఎస్పీ బాలు.. కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష - sp balasubrahmanyam critical

ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఐసీయూకి తరలించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో దిగ్గజ సింగర్​ త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, అభిమానులు ట్విట్టర్​లో ట్వీట్లు చేస్తున్నారు.

sp-balasubrahmanyam
ఐసీయూలో ఎస్పీ బాలు.. కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష
author img

By

Published : Aug 14, 2020, 7:43 PM IST

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు పలువురు సినీప్రముఖులు, అభిమానులు. ఇందులో సంగీత దర్శకులు ఏఆర్​ రెహమాన్​, అనిరుధ్​ రవిచందర్​, నటుడు భారతీరాజా, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్​ తదితరులు ఉన్నారు.

  • Get well soon dear SPB sir.. praying for your speedy recovery!

    — Anirudh Ravichander (@anirudhofficial) August 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • என் நண்பன்

    பாலு,
    தன்னம்பிக்கையானவன்..
    வலிமையானவன்..
    அவன் தொழும் தெய்வங்களும்
    நான் வணங்கும்
    இயற்கையும்
    அவனை உயிர்ப்பிக்கும்..
    மீண்டு வருவான்
    காத்திருக்கிறேன்.

    அன்புடன்
    பாரதிராஜா pic.twitter.com/8gyemadGpg

    — Bharathiraja (@offBharathiraja) August 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బులెటిన్​ విడుదల...

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి యాజమాన్యం శుక్రవారం(ఆగస్టు 14న) బులెటిన్​ విడుదల చేసింది.

"ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. అయితే గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురి కావడం వల్ల వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయన్ని ఐసీయూకి తరలించాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది" అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.