కేవలం 11 రూపాయల పారితోషికానికే స్టార్ హీరోయిన్.. ఓ సూపర్‌హిట్ చిత్రంలో నటించిందంటే నమ్మగలరా? అలా ఎలా అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగానే జరిగింది. ఈ విషయాన్ని 'భాగ్ మిల్కా భాగ్' దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రా.. తన ఆత్మకథలో వెల్లడించారు.
'ఫ్లయింగ్ సిఖ్'గా గుర్తింపు తెచ్చుకున్న ప్రపంచస్థాయి అథ్లెట్ మిల్కా సింగ్ బయోపిక్ 'భాగ్ మిల్కా భాగ్'. స్టార్ నటుడు ఫర్హాన్ అక్తర్ మిల్కా సింగ్ పాత్ర పోషించారు.కథానాయికగా సోనమ్‌కపూర్ నటించింది. ఇందులో నటించేందుకు సోనమ్.. కేవలం రూ.11 మాత్రమే తీసుకుందని చిత్ర డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్.. తన ఆత్మకథలో వివరించారు.
కారణం అదేనా..
'కేవలం ఏడు రోజుల్లో సోనమ్ సన్నివేశాలను పూర్తిచేశాం. దేశ విభజన సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు, మిల్కాసింగ్ జీవిత కథను సినిమాగా తీస్తున్నందుకు సోనమ్.. చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమాకు తనవంతు మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు' అని 'భాగ్ మిల్కా భాగ్' దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్చె ప్పారు.
ప్రస్తుతం సోనమ్‌కపూర్ 'బ్లయిండ్' అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది.
ఇదీ చదవండి: Prabhas Salaar: ప్రభాస్ 'సలార్' వీడియో లీక్