బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. తన ట్విట్టర్ ఖాతాను తొలగిస్తున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. ప్రతికూలతకు దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకన్నట్లు చెప్పింది. మరోవైపు నటుడు సాకిబ్ సలీమ్, ట్విట్టర్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపాడు. ద్వేషం, బెదిరింపులు ఎక్కువవడమే ఇందుకు కారణాలుగా పేర్కొన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"మీ తెలివిని కాపాడుకోవాలంటే ప్రతికూలతకు ముందుగా దూరంగా ఉండాలి. ట్విట్టర్ వ్యతిరేకతకు(నెగిటివిటీ) వేదికగా మారింది. కాబట్టి నేను నా ఖాతాను డీయాక్టివేట్ చేస్తున్నా. బై ఫ్రెండ్స్"
సోనాక్షి సిన్హా, బాలీవుడ్ నటి
ట్విట్టర్ నుంచి నిష్క్రమించే సమయానికి ఈమెకు 15.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, సోనాక్షి పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. ట్విట్టర్ నుంచి వైదొలగడానికి ఇదీ ఓ కారణమని నెటిజెన్లు భావిస్తున్నారు.
నటుడు సాకిబ్ సలీమ్.. ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఖాతా తెరిచినప్పుడు విజ్ఞానానికి, భావ వ్యక్తీకరణకు ఇది గొప్ప వేదికగా ఉండేదని.. క్రమక్రమంగా బెదిరింపులు, ద్వేషాలకు నిలయంగా మారిందని అన్నాడు.
ఇదీ చూడండి: డిజిటల్ తెరపై వెండితెర తారలు