'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన అచ్చ తెలుగు ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిలో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న ఈ భామ.. హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.
ఆమె త్వరలోనే 'మంకీమ్యాన్' అనే హాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ విషయాన్ని శోభిత అధికారికంగా ప్రకటించింది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' హీరో దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి చిత్రమిది.
-
Wish me luck 🙏🏽🤗 pic.twitter.com/V4CPirVvRl
— Sobhita Dhulipala (@sobhitaD) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wish me luck 🙏🏽🤗 pic.twitter.com/V4CPirVvRl
— Sobhita Dhulipala (@sobhitaD) March 17, 2021Wish me luck 🙏🏽🤗 pic.twitter.com/V4CPirVvRl
— Sobhita Dhulipala (@sobhitaD) March 17, 2021
దీని గురించి శోభిత మాట్లాడుతూ.. "ఓ స్ఫూర్తిదాయక కథతో రూపొందిన చిత్రమిది. చక్కటి యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. నా పాత్ర చాలా సున్నితంగా ఉంటూనే.. భావోద్వేగభరితంగా కనిపిస్తుంది" అన్నారు.
ఇదీ చూడండి: 'మంచి కథ దొరికితే రిస్క్ తీసుకోక తప్పదు'