ETV Bharat / sitara

రాజ్​కుంద్రా-శిల్పాశెట్టి విడిపోనున్నారా? - shilpa shetty husband

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్​ అయిన తన భర్త రాజ్​కుంద్రా అమాయకుడని పలుమార్లు చెప్పుకొచ్చిన నటి శిల్పాశెట్టి.. ఇప్పుడు మౌనం వహించడంపై బాలీవుడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తన భర్త తప్పు చేశాడా? లేదా? అనేది కాకుండా.. ఇలాంటి పరిణామాల మధ్య రాజ్​కుంద్రాకు దూరంగా జీవించడమే సరైనదని శిల్ప భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తమ పిల్లలనూ కుంద్రాకు దూరంగా పెంచాలనే ఉద్దేశంతో శిల్ప ఉన్నట్లు తెలుస్తోంది.

Shilpa Shetty plans life away from Raj Kundra?
రాజ్​కుంద్రా-శిల్పాశెట్టి విడిపోనున్నారా?
author img

By

Published : Aug 30, 2021, 2:43 PM IST

అశ్లీల చిత్రాల కేసులో తన భర్త రాజ్​కుంద్రా అరెస్ట్​ అయినప్పటి నుంచి సోషల్​మీడియాలో తరచుగా పోస్ట్​లు చేస్తోంది బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి. ఇప్పుడు మరోసారి 'మిస్టేక్స్​' అనే పుస్తకం నుంచి కొన్ని వాక్యాలను ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​ షేర్​ చేసింది. జీవితంలో తప్పులు చేయడం సహజమని.. వాటిని దాటుకొని ముందుకు వెళ్లాలనేది దాని సారాంశం.

ఆ పుస్తకంలోని వాక్యాలను ఫొటో తీసి.. ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​లో శిల్పాశెట్టి పోస్ట్​ చేసింది. "జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో తప్పులు చేస్తూనే ఉంటారు" అనే వాక్యానికి.."తప్పు జరిగింది.. అయినా పర్లేదు" అనే స్టిక్కర్​ను జతచేసింది. అయితే ఇది తన తర్వాతి జీవితానికి అన్వయించుకొని పోస్ట్​ చేసినట్లు తెలుస్తోంది.

పోర్నోగ్రఫీ కేసులో రాజ్​కుంద్రా ప్రధాన నిందితుడిగా అరెస్ట్​ అయిన తర్వాత.. అతడి నుంచి దూరంగా జీవించాలని శిల్పాశెట్టి యోచిస్తున్నట్లు సమాచారం. రాజ్​కుంద్రాకు సంబంధించిన ఆస్తులను అనుభవించేందుకు శిల్ప ఆసక్తి చూపడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకు, కుమార్తెను రాజ్​కుంద్రాకు దూరంగా పెంచాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి.. మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టిన శిల్పాశెట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.