రైల్వేస్టేషన్‌లో తల్లి చనిపోయిందని తెలియక 'అమ్మా లే' అంటూ నిద్రలేపేందుకు ప్రయత్నించిన పిల్లాడిని చూసి.. ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ చలించిపోయారు. ముజఫర్‌పుర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో తన మనసును కదిలించిందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ చిన్నోడిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
-
Thank you all for getting us in touch with the little one. We all pray he finds strength to deal with the most unfortunate loss of a parent. I know how it feels...Our love and support is with you baby. https://t.co/2Z8aHXzRjb
— Shah Rukh Khan (@iamsrk) June 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you all for getting us in touch with the little one. We all pray he finds strength to deal with the most unfortunate loss of a parent. I know how it feels...Our love and support is with you baby. https://t.co/2Z8aHXzRjb
— Shah Rukh Khan (@iamsrk) June 1, 2020Thank you all for getting us in touch with the little one. We all pray he finds strength to deal with the most unfortunate loss of a parent. I know how it feels...Our love and support is with you baby. https://t.co/2Z8aHXzRjb
— Shah Rukh Khan (@iamsrk) June 1, 2020
"అనాథలుగా మారిన ఆ పిల్లల పూర్తి బాధ్యత మీర్ ఫౌండేషన్ చూసుకుంటుంది. ప్రస్తుతం ఆ పిల్లలు వారి తాత సంరక్షణలో ఉన్నట్లు సమాచారం ఉంది. వారికి సహాయం చేయడానికి మాకు దారి చూపిన ప్రతి ఒక్కరికీ మీర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను. 30 సంవత్సరాల క్రితం నా తల్లి చనిపోయింది. తల్లిదండ్రులు లేని లోటు ఎలా ఉటుందో నాకు తెలుసు. వారితో తగినంత సమయం గడపలేకపోయాననే బాధ జీవితాంతం వేధిస్తుంటుంది. అందుకే మేము మా కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్న మా పిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. వారు ఎక్కడికైనా వెళ్లినా, మేము దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు ఫోన్‌లో చాట్ చేస్తూనే ఉంటాం".
-షారుక్ ఖాన్, బాలీవుడ్ కథానాయకుడు
ఏం జరిగిందంటే?
కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి స్వస్థలానికి బయల్దేరిన ఓ మహిళ.. గుజరాత్‌లో మే 23న రైలెక్కింది. అయితే మే 25న రైలు ముజఫర్‌పుర్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
అసలే తిండి లేకపోవడం, ఆపై డీహైడ్రేషన్ కారణంగా నీరసించి మృతిచెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం వద్ద ఉంచారు. అయితే తన తల్లి చనిపోయిన విషయం తెలియని పసిబిడ్డ.. ఆమె దుప్పటితో ఆడుకోవడం, తల్లిని లేపడానికి ప్రయత్నించడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఆ ఘటన ఎంతో మందిని కలచివేసింది.
-
छोटे बच्चे को नहीं मालूम कि जिस चादर के साथ वह खेल रहा है वह हमेशा के लिए मौत की गहरी नींद सो चुकी माँ का कफ़न है। 4 दिन ट्रेन में भूखे-प्यासे रहने के कारण इस माँ की मौत हो गयी। ट्रेनों में हुई इन मौतों का ज़िम्मेवार कौन? विपक्ष से कड़े सवाल पूछे जाने चाहिए कि नहीं?? pic.twitter.com/pdiaHuS9vf
— Sanjay Yadav (@sanjuydv) May 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">छोटे बच्चे को नहीं मालूम कि जिस चादर के साथ वह खेल रहा है वह हमेशा के लिए मौत की गहरी नींद सो चुकी माँ का कफ़न है। 4 दिन ट्रेन में भूखे-प्यासे रहने के कारण इस माँ की मौत हो गयी। ट्रेनों में हुई इन मौतों का ज़िम्मेवार कौन? विपक्ष से कड़े सवाल पूछे जाने चाहिए कि नहीं?? pic.twitter.com/pdiaHuS9vf
— Sanjay Yadav (@sanjuydv) May 27, 2020छोटे बच्चे को नहीं मालूम कि जिस चादर के साथ वह खेल रहा है वह हमेशा के लिए मौत की गहरी नींद सो चुकी माँ का कफ़न है। 4 दिन ट्रेन में भूखे-प्यासे रहने के कारण इस माँ की मौत हो गयी। ट्रेनों में हुई इन मौतों का ज़िम्मेवार कौन? विपक्ष से कड़े सवाल पूछे जाने चाहिए कि नहीं?? pic.twitter.com/pdiaHuS9vf
— Sanjay Yadav (@sanjuydv) May 27, 2020
ఇదీ చూడండి... రానా-మిహీకా పెళ్లి.. ముచ్చటగా మూడు రోజుల వేడుక