ETV Bharat / sitara

వైద్యులకు షారుక్​ భరోసా.. 25 వేల రక్షణ కిట్లు విరాళం - corona donations

మహారాష్ట్ర ప్రభుత్వానికి 25 వేల పీపీఈ కిట్లను విరాళంగా అందించాడు బాలీవుడ్ హీరో షారుక్​ఖాన్. ​కరోనాతో ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్య బృందాలకు ఈ రక్షణ కవచాలను.. అందించి అందరి మన్ననలనూ పొందుతున్నాడు.

Shah Rukh Khan provides 25,000 PPE kits to Maharashtra
25వేల రక్షణ కిట్లు అందించిన షారుక్​!
author img

By

Published : Apr 14, 2020, 8:52 AM IST

కరోనా ఓ మహమ్మారి అని తెలిసినా.. తాకిన వారూ వైరస్​ బారినపడే అవకాశమున్నా.. వైద్యులు వారి ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్​-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అలాంటి వైద్య బృందం రక్షణ కోసం ముందడుగు వేసి, ​ మరోసారి పెద్దమనసును చాటుకున్నాడు బాలీవుడ్​ బాద్​షా​ షారుక్​ఖాన్. స్వచ్ఛంద సంస్థ 'మీర్' ద్వారా 25 వేల వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ)లను మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందించాడు.

షారుక్​ ఉదార మనసుకు.. మహారాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి రాజేశ్​ తోపె సైతం సలాం అన్నారు.

" 25 వేల పీపీఈలు విరాళంగా ఇచ్చినందుకు షారుక్​ఖాన్​కు ధన్యవాదాలు. ఇవి కరోనాతో పోరాడేందుకు ఎంతో సహకరిస్తాయి. వైరస్​ నుంచి మన వైద్య బృందాన్ని కాపాడుకునేందుకు దోహదపడతుంది" అని మంత్రి ట్వీట్​ చేశారు. ఆయన ట్వీట్​కు బదులిస్తూ ఈ బాలీవుడ్​ హీరో స్పందించాడు. ఐక్యమత్యంగా కరోనాతో పోరాడదామని సమాధానమిచ్చాడు.

" కిట్స్​ తెప్పించేందుకు మీరు చేసిన సాయానికి ధన్యవాదాలు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ.. మానవత్వాన్ని కాపాడేందుకు మనమంతా కలిసి పనిచేయాలి. ఇందులో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది. మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా."

-షారుక్​ ఖాన్​

ఎప్పుడూ ముందే...

దేశానికి కష్టం వస్తే.. సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు షారుక్​. ఇటీవలె భార్య గౌరి ఖాన్​తో కలిసి.. కొవిడ్​-19 బాధితుల చికిత్స సౌకర్యార్థం నాలుగు అంతస్తుల భవనాన్ని ఇచ్చేశాడు. అంతే, కాదు ఐపీఎల్​ ఫ్రాంచైజీ ​​ కోల్​కోతా నైట్​ రైడర్స్ ద్వారా పొందే ఆదాయాన్ని పీఎం కేర్స్​, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తామని ఇప్పటికే ప్రకటించాడు.

మీర్​ ఫౌండేషన్​, రోటీ ఫౌండేషన్​ సంయుక్తంగా ఒక నెల రోజుల పాటు 3 లక్షల భోజన ప్యాకెట్లను.. 10 వేలమంది వలసకూలీలకు అందించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో యాసిడ్​ దాడికి గురైన 100మంది బాధితులకు సాయం చేస్తున్నాడు.

ఇదీ చదవండి:పనికిరాని బస్సులతో బాడీ శానిటైజింగ్ టన్నెల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.