ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులతో పాటు, పలువురు ప్రముఖులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా అదే సూచన చేస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని, అది కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వరుస ట్వీటులు చేశారు.
-
I believe that we'll all emerge stronger from this crisis. Stay safe everyone 🙏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I believe that we'll all emerge stronger from this crisis. Stay safe everyone 🙏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021I believe that we'll all emerge stronger from this crisis. Stay safe everyone 🙏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021
-
As the COVID-19 cases surge everyday, please remember to wear your mask every time you're around people and step out only if it's absolutely necessary!
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">As the COVID-19 cases surge everyday, please remember to wear your mask every time you're around people and step out only if it's absolutely necessary!
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021As the COVID-19 cases surge everyday, please remember to wear your mask every time you're around people and step out only if it's absolutely necessary!
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021
"రోజురోజుకూ కొవిడ్-19 తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. అవసరమైతేనే బయటకు వెళ్లండి. ఒకవేళ కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో పరిశీలన చేసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీని ద్వారా అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతామని నేను నమ్ముతున్నా. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి" -ట్విటర్‌లో మహేశ్‌బాబు
మహేశ్‌బాబుతో బాటు పలువురు సినీ నటులు కూడా కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు సినీ నిర్మాణ సంస్థలు కరోనా బాధితులకు అవసరమైన సమాచారాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంటూ వారి అవసరాలను తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.