ETV Bharat / sitara

సూర్య పాత్రకు సత్యదేవ్‌ డబ్బింగ్!

తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమాలో సూర్య పాత్ర కోసం టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం.

సూర్య
సూర్య
author img

By

Published : May 23, 2020, 12:09 PM IST

తమిళ నటుడు సూర్య చిత్రానికి టాలీవుడ్‌ యువ కథానాయకుడు సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పబోతున్నాడా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సురరై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీహద్దురా' పేరుతో విడుదల కాబోతుంది.

గతంలో సూర్య పలు చిత్రాలకు తానే తెలుగులో డబ్బింగ్‌ చెప్పినా.. ఈసారి మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని భావించాడట. సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తెలుగులో ఎవరు బాగా డబ్బింగ్‌ చెప్పగలరు? అనే అన్వేషణలో సత్య వాయిస్‌ అయితే సరిపోతుందని చిత్రబృందం అనుకుంటుందని సమాచారం. ఇప్పటికే చర్చలు సాగాయని తెలుస్తోంది. మరి సూర్య నటనకు సత్యదేవ్‌ గాత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చాడు. కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం వేసవిలో సందడి చేయాల్సి ఉండగా... లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.