ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు భారీ సినిమాలు బరిలో ఉన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా ఈ రెండింటిని ఒకేరోజు(జనవరి 12) విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత నిర్మాతల మధ్య కుదిరిన సయోధ్య కారణంగా మహేశ్‌బాబు ఓ రోజు(జనవరి 11) ముందుకు జరిగాడు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ సినిమాల విడుదల తేదీలు మారే అవకాశముందట.
ఇంతకీ కారణమేంటి?
మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. యూబైఏ సర్టిఫికెట్ వచ్చింది. కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇందులో సంక్రాంతికి విడుదల అని మాత్రమే ఉంది. తేదీని మాత్రం ముద్రించలేదు. ఈ విషయం ప్రిన్స్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
బన్నీ 'అల వైకుంఠపురములో' సినిమా విషయంలోనూ, రిలీజ్ డేట్ జనవరి 10కి మార్చాలని నిర్మాతలు భావిస్తున్నారట. బయ్యర్లు తెస్తున్న ఒత్తిడే ఇందుకు కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. నూతన సంవత్సరం సందర్భంగా చిత్రబృందం పంచుకున్న పోస్టర్లలో విడుదల తేదీ వేయలేదు. ఈ కారణంగానే అభిమానుల మదిలో సందేహాలు మొదలయ్యాయి.