ETV Bharat / sitara

పోస్ట్ ప్రొడక్షన్​లో 'శాకుంతలం'.. కొత్త సినిమాల పాటల సందడి - cinema news

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సమంత శాకుంతలం, రౌడీబాయ్స్, హీరో, ద గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Jan 3, 2022, 12:03 PM IST

Samantha shakuntalam: సమంత టైటిల్​ రోల్​లో నటించిన చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోగా.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్​లో బిజీగా ఉన్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.

ఇందులో సమంతతో పాటు దేవ్​మోహన్, అల్లు అర్హ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమ గుణ నిర్మించారు. ఈ పీరియాడికల్ చిత్రం విడుదలపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

సంక్రాంతి బరిలో నిలిచిన 'రౌడీబాయ్స్', 'హీరో' సినిమాల నుంచి కొత్త పాటలు రిలీజయ్యాయి. 'బృందావనం' అంటూ సాగుతున్న గీతంలో అశిష్, అనుపమ కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు మహేశ్ మేనల్లుడు అశోక్.. 'హీరో'లోని ర్యాప్​ సాంగ్​లో ఆకట్టుకున్నాడు. రోల్​రైడా పాడిన ఈ గీతానికి తోడు విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

The great indian kitchen tamil: గతేడాది మలయాళంలో వచ్చిన బెస్ట్​ మూవీస్​లో 'ద గ్రేట్​ ఇండియన్ కిచెన్' టాప్​లో ఉంటుంది. ఆ సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్​ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన కొత్త లుక్​ను సోమవారం రిలీజ్ చేశారు.

the great indian kitchen tamil
ద గ్రేట్ ఇండియన్ కిచెన్(తమిళం)

త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆర్. కన్నన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్​ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.