ETV Bharat / sitara

సమంత శాకుంతలం పూర్తి.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' తెలుగులో - సమంత మూవీ అప్డేట్స్

ముద్దుగుమ్మ సమంత లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేశాయి. ఆమె టైటిల్​ రోల్ చేసిన 'శాకుంతలం' చిత్రీకరణ ముగిసింది. మరోవైపు ఆమె విభిన్నంగా కనిపించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' తెలుగు ఆడియో అందుబాటులోకి వచ్చింది.

Samantha Shaakuntalam
సమంత
author img

By

Published : Aug 25, 2021, 10:29 AM IST

సమంత 'శాకుంతలం' షూటింగ్ మంగళవారంతో(ఆగస్టు 24) పూర్తయింది. ఓ వీడియోను కూడా విడుదల చేశారు. నిర్మాత నీలిమ గుణ సహా పలువురు చిత్రబృందంలోని సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పీరియాడికల్ కథతో తీసిన ఈ చిత్ర రిలీజ్​పై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహాభారతంలోని దృశ్యకావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, మలయాళ నటుడు దేవ్​మోహన్​ ప్రధాన పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కుమార్తె అర్హ.. ప్రిన్స్ భరత పాత్రలో నటించింది. మణిశర్మ సంగీతమందించారు. అద్భుత చిత్రాల సృష్టికర్త గుణశేఖర్​ దర్శకత్వం వహించారు.

samantha dev mohan
సమంత దేవ్​మోహన్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' తెలుగులో

సమంత నటించిన తొలి వెబ్ సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'. జూన్ 3న అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేశారు. అయితే హిందీలో మాత్రమే ఆడియో ఉండటం వల్ల పలువురు తెలుగు ప్రేక్షకులకు ఇది ఇబ్బందిగా మారింది. అయితే ఎట్టకేలకు తెలుగు, తమిళ ఆడియోలను అందుబాటులో తీసుకొచ్చారు. దీంతో సామ్ అభిమానులు, ఈ సిరీస్​ను చూసేందుకు సిద్ధమవుతున్నారు.

samantha the family man 2
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్​లో సమంత

ఎల్​టీటీఈ ఉద్యమ నేపథ్య కథతో 'ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్​ను తెరకెక్కించారు. ఈ సిరీస్​ వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ, ప్రేక్షకులు మాత్రం విశేషంగా ఆదరించారు. రాజ్-డీకే ద్వయం దీనికి దర్శకత్వం వహించారు. మూడో సీజన్​ చైనా-కరోనా నేపథ్యంగా తెరకెక్కించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.