ETV Bharat / sitara

రాధే రిలీజ్​.. తగ్గేదే లే అంటున్న సల్మాన్ - సల్మాన్​ ఖాన్​ కొత్త సినిమా కబుర్లు

బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ నటించిన రాధే సినిమాను యథావిధిగా అంతకుముందు ప్రకటించిన తేదీకే మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

Salman Khan
సల్మాన్​ ఖాన్​
author img

By

Published : Apr 21, 2021, 3:20 PM IST

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వరుసగా బాలీవుడ్​ సినిమాల విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. అయితే సూపర్​ స్టార్​ సల్మాన్​ ఖాన్​ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తాను నటించిన 'రాధే' సినిమాను అంతకుముందు ప్రకటించిన తేదీకే మే 13న రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు సహా ఓటీటీ ప్లాట్​ఫాం(జీ5, జీప్లెక్స్​)లో రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్​ను ఏప్రిల్​ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ చిత్రంలో సల్మాన్ సరసన దిశా పటానీ నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్​, జరీనా వాహబ్, రణదీప్​ హుడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడితో ఇంతకు ముందు 'వాంటెడ్', 'రెడీ', 'దబంగ్ 3' సినిమాల్లో నటించారు సల్మాన్.

ఇవీ చదవండి: 'అపరిచితుడు' హిందీ రీమేక్​కు గ్రీన్​సిగ్నల్​

మల్లికా శెరావత్ చీరకట్టు అందం చూడతరమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.