ETV Bharat / sitara

సల్మాన్​ స్వచ్ఛభారత్​.. ఫార్మ్​హౌస్​ను శుభ్రం చేస్తూ - చెట్ల కొమ్మలను తొలగించిన సల్మాన్​ఖాన్​

నిసర్గ తుఫానుతో తన వ్యవసాయ క్షేత్రంలో విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలిగిస్తున్న ఓ వీడియోను పోస్ట్​ చేశారు స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​. ఇందులో స్వచ్ఛ భారత్​ అంటూ రాసుకొచ్చారు.

salman
సల్మాన్​
author img

By

Published : Jun 6, 2020, 6:30 PM IST

లాక్​డౌన్​ ప్రారంభం నుంచి బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​, ముంబయికి దూరంగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. తాజాగా ప్రపంచ ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జున్​ 5) సందర్భంగా ఇన్​స్టాలో ఓ వీడియోను పోస్ట్​ చేశారు. నిసర్గ తుఫాను ప్రభావంతో విరిగిపోయిన చెట్ల కొమ్మలను తొలగించి, చీపురుతో ఊడుస్తూ ఇందులో కనిపించారు. 'స్వచ్ఛభారత్​.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం' అంటూ వ్యాఖ్యను జోడించారు. ఆయనతో పాటు లులియా వంతూర్‌, నటి జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌ ఉన్నారు.

లాక్​డౌన్​తో ఫామ్​హౌస్​లో ఉంటున్న​ సల్మాన్.. జాక్వెలిన్​తో కలిసి రెండు పాటల్లో నటించారు. వాటిని ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు.​ ప్రస్తుతం ఈయన ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే' సినిమా చేస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్. జాకీష్రాఫ్, భరత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది.

ఇదీ చూడండి : చీపురు పట్టి అమ్మకు సాయం చేసిన సితార

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.