కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ ఆజ్ కల్ 2'. ఈ సినిమా సీక్వెల్‌కు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మొదటి పార్ట్‌లో దీపికా పదుకునే ప్రేమికుడిగా మెప్పించిన సైఫ్.. ఈ భాగంలో మాత్రం హీరో లేదా హీరోయిన్‌కు తండ్రిగా కనిపించనున్నాడు. నిజ జీవితంలో సారా అలీఖాన్‌కు తండ్రి అయిన సైఫ్ వీరిద్దరితో కలిసి ఎలా నటిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Saif Ali Khan to play Kartik Aaryan’s father in Love Aaj Kal2? https://t.co/qh9DE1UYqh pic.twitter.com/KOiHwZhfMp
— Saif Ali Khan Online (@SaifOnline) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Saif Ali Khan to play Kartik Aaryan’s father in Love Aaj Kal2? https://t.co/qh9DE1UYqh pic.twitter.com/KOiHwZhfMp
— Saif Ali Khan Online (@SaifOnline) March 31, 2019Saif Ali Khan to play Kartik Aaryan’s father in Love Aaj Kal2? https://t.co/qh9DE1UYqh pic.twitter.com/KOiHwZhfMp
— Saif Ali Khan Online (@SaifOnline) March 31, 2019
ఇప్పటివరకు సారా, కార్తీక్ జంటగా ఏ చిత్రంలోనూ నటించలేదు. కానీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. కార్తీక్ చివరిగా కృతి సనన్‌తో కలిసి 'లూకా చుప్పీ' సినిమాలో కనిపించగా.. సారా ఇటీవల విడుదలైన రణ్వీర్ సింగ్ 'సింబా'లో సందడి చేసింది.