RRR movie trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ప్రేక్షకులను అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్ అయితే గూస్బంప్స్ తెప్పిస్తోంది.
గురువారం ఉదయం 10 గంటలకు థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇక అప్పటినుంచి జైత్రయాత్ర మొదలైంది. వ్యూస్, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగులో 20.45 మిలియన్ వ్యూస్, హిందీలో 19 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మిగతా వ్యూస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి తెలుగు ట్రైలర్‌గా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది.
RRR movie: ట్రైలర్ వ్యూస్ ఇచ్చిన ఊపులోనే సినిమాను మరింతగా ప్రమోట్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందులో భాగంగానే ముంబయిలో గురువారం ఉదయం ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో సాయంత్రం జరగాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. శుక్రవారం.. బెంగళూరు, చెన్నైలో 'ఆర్ఆర్ఆర్' ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇది విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- RRR movie: కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా!
- నాటు నాటు స్టెప్.. రాజమౌళి వల్ల ఎన్టీఆర్‌కు కష్టాలు!
- RRR Trailer Launch: 'హాలీవుడ్ ఛాన్స్ వచ్చినా.. అలానే చేస్తా'
- ''ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూస్తుంటే గర్వంగా ఉంది'
- 'ఆర్ఆర్ఆర్' సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి ఎంతంటే?
- అక్కడ 1,000 మల్టీప్లెక్స్‌ల్లో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్
- ఒమిక్రాన్ భయం.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ కష్టమేనా?
- ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతా: రాజమౌళి