ETV Bharat / sitara

బాహుబలి రికార్డుపై 'ఆర్ఆర్​ఆర్​' కన్ను! - ఎన్టీఆర్​

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్​ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్​ బిజినెస్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 'బాహుబలి' రికార్డునూ అధిగమిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

rrr-shatters-baahubali-2-pre-release-business-record-film-trade
బాహుబలి రికార్డును అధిగమించిన 'ఆర్ఆర్​ఆర్​'
author img

By

Published : Feb 12, 2020, 9:37 AM IST

Updated : Mar 1, 2020, 1:40 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్​ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. ఈ సినిమా విడుదల తేదీ ఇటీవలే ఖరారైంది. అయితే చిత్రం థియేటర్లలోకి రాకముందే భారీ బిజినెస్​ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జక్కన్న రూపొందించిన బాహుబలి సిరీస్​ ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. అందువల్లే ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా 'ఆర్​ఆర్​ఆర్​' ఇంకా చిత్రీకరణలో ఉండగానే డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారట.

ఈ సినిమా పంపిణీ హక్కుల బిజినెస్​ 'బాహుబలి 2' రికార్డులు బ్రేక్​ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రయపడుతున్నారు. గతంలో ప్రభాస్​ సినిమా రూ.335 కోట్ల ప్రీరిలీజ్​ బిజినెస్​ చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'ఆర్ఆర్​ఆర్​' రూ.400 కోట్ల మార్కెట్​లో ధర పలుకుతుందని సినీ పండితులు అంచనా వేశారు. ఇది కేవలం సౌత్​ ఇండియా, ఓవర్సీస్​ల బిజినెస్​ మాత్రమేనట. నార్త్​ ఇండియాలో సినిమా పంపిణీ ఒప్పందం ఇంకా ఎవరితోనూ కుదరలేనట్లు సమచారం.

తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు ధర..

ఇప్పటికే 'ఆర్​ఆర్​ఆర్​' నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్​రాజ్​ సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఏకంగా 76 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా హక్కులు దక్కించుకున్నాడట. విడుదలకు ముందే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.225 కోట్ల ముందస్తు వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. అయితే, నైజాం పరిధిలో ఇప్పటివరకూ ఏ చిత్రం (బాహుబలితో సహా) 70 కోట్ల కలెక్షన్లు సాధించలేదు.

2021, జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదలకానుందీ చిత్రం. రామ్​ చరణ్​.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్​గా తెరపై కనిపించనున్నారు.

ఇదీ చూడండి.. రికార్డు ధరతో 'ఆర్​ఆర్​ఆర్' నైజాం హక్కుల కొనుగోలు​!

Last Updated : Mar 1, 2020, 1:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.