ETV Bharat / sitara

చిరు సినిమాల్లోకి రావడానికి కారణం అదే!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే ఆయన డ్యాన్స్​లు, ఫైట్​లు, డైలాగ్​లు కళ్లముందు మెదులుతాయి. తన టైమింగ్​తో ఇండియన్ బాక్సాఫీస్​ను రఫ్ఫాడించిన చిరు అసలు సినిమాల్లోకి రావడానికి కారణమేంటో తెలుసా! అయితే తెలుసుకోండి.

చిరు సినిమాల్లోకి రావడానికి కారణం అదే!
చిరు సినిమాల్లోకి రావడానికి కారణం అదే!
author img

By

Published : Aug 22, 2020, 8:37 AM IST

ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా వచ్చిన శివశంకర్​ వర ప్రసాద్​.. మెగాస్టార్​ చిరంజీవిగా ఎలా మారారో అని చాలా మందికి సందేహం. ఈ విషయంపై 'ఈనాడు' ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరు... నటనను వృత్తిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో చెప్పారు.

"చిన్నప్పుడు సినిమాలు చూసేవాడిని కాదు. కానీ నటనపై మాత్రం మక్కువ ఉండేది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు స్కిట్​లు వేసేవాడ్ని, జ్యోతిలక్ష్మి పాటలకు చిందేసేవాడ్ని. అప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే ఈ వృత్తి ఎందుకు ఎంచుకోకూడదా అని అనిపించింది. మా నాన్న ఒకట్రెండు చిత్రాల్లో నటించారు. ఆయన ఆ విశేషాలు చెపుతుంటే ఆ ఆలోచన కాస్త బలపడింది. అలా నటుడిని కావాలన్న కోరిక పుట్టింది. సావిత్రి, ఎస్వీఆర్ అంటే నాన్నకు చాలా ఇష్టం. వారిపై అలా నాకు అభిమానం ఏర్పడింది. సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వద్దనలేదు. ఏడాది పాటు ప్రయత్నించు, కుదరకపోతే వచ్చేయ్. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. అలా ఫిల్మ్ స్కూల్​లో శిక్షణ తీసుకుంటుండగానే నటుడిగా అవకాశలొచ్చాయి"

-చిరంజీవి, నటుడు

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్​ ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదలవనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.