యువ నటుడు రాజ్‌తరుణ్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. 'అనుభవించు రాజా'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అన్నపూర్ణ స్డూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ ఈ మూవీని నిర్మించనున్నాయి. ఈ చిత్రంలో 'బంగారం' పాత్రలో రాజ్‌తరుణ్‌ను పరిచయం చేస్తూ కింగ్ నాగార్జున టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. గావిరెడ్డి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

'మాస్ట్రో' విడుదల ఖరారు
నితిన్, నభా నటేశ్ జంటగా రూపొందిన చిత్రం 'మాస్ట్రో'. ప్రముఖ నాయిక తమన్నా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి: seetimaarr: గోపిచంద్ 'సీటీమార్' రిలీజ్ డేట్ ఫిక్స్