సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చెన్నై ట్రాఫిక్ పోలీసులు జరిమానా రూ.100 విధించారు. జూన్ 26న కారులో వెళుతూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే ఇందుకు కారణం. జులై 23న ఈ మొత్తాన్ని చెల్లించారు రజనీ.
జులై 20న తన ఫామ్‌హౌస్ నుంచి కేలంబాకమ్కు రజనీకాంత్ ఈ కారులో వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో జిల్లాకు వెళ్లేందుకు ఆయనకు ఈ-పాస్ ఉందా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. కానీ ఈ-పాస్ తీసుకుని, మెడికల్ ఎమర్జెన్సీ కోసమే రజనీ, కేలంబాకమ్ వెళ్లినట్లు తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం లాంబోర్గిని కారు నడుపుతున్న రజనీ వీడియో వైరల్‌గా మారింది. కుమార్తె సౌందర్య కుటుంబంతో కారు దగ్గర నిలబడిన ఫొటోలు ఇటీవలే బయటకొచ్చాయి.
ఇవీ చదవండి: