అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపారి రాజ్ కుంద్రాకు(raj kundra news hindi) తాత్కాలిక ఊరట లభించింది. ముంబయిలోని న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్ తోర్పేకూ ముంబయి కోర్టు బెయిల్ ఇచ్చింది.
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు జులై 19న రాజ్‌కుంద్రాను(Rajkundra net worth) అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు సాగిస్తున్న అధికారులు.. సాక్ష్యాలను సేకరించి కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కుంద్రాపై ఇటీవలే 1,400 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు అధికారులు. మరోవైపు కుంద్రా కూడా కోర్టులో బెయిల్(raj kundra bail high court) కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చూడండి: 'పోర్నోగ్రఫీ కేసులో నన్ను బలిపశువును చేశారు'