పాత్రలను బట్టి నటులకు విభిన్న మేకప్‌లు వేయడం సహజం. అయితే మరీ శరీర రంగు మార్చేసేంతలా అవసరమా అన్నదే ప్రధాన చర్చ. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే.. ఉన్నతస్థాయి, ధనికుల పాత్రల్లో నటించే వారు తెల్లగా ఉంటారు. దిగువ తరగతి వారు, పేదలు, శ్రామికులను నల్లగా లేదా చామన ఛాయలో చూపిస్తుంటారు.
మదర్ ఇండియా సినిమాలో రైతుగా నటించిన సునీల్ దత్‌ను, ఉడ్తా పంజాబ్ సినిమాలో ఆలియా భట్‌ను చామన ఛాయలో చూపించారు దర్శకులు. నిజానికి వారి శరీర వర్ణం తెలుపు. మరి అలా ఎందుకు తెరకెక్కించారు? పాత్రధారులు తెల్లగా ఉన్నా... భారీ మేకప్ వేసి మరీ రంగు మార్చి చూపించడంలో అంతర్యమేమిటి? ఇది వివక్షేనంటూ దశాబ్దాల కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా సూపర్-30 చిత్రంతో మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది.
సూపర్-30 లో....
హృతిక్ రోషన్ నటించిన సూపర్-30 సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం బిహార్‌కు చెందిన గణిత శాస్త్ర మేధావి ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఎంతో మంది పేద విద్యార్థులను పోటీ పరీక్షల కోసం తీర్చిదిద్దిన ఆనంద్ పాత్ర హృతిక్‌ది.
ఆనంద్ పాత్ర కోసం హృతిక్‌కు వేసిన మేకప్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తెల్లగా ఉన్న హృతిక్‌ను ఈ చిత్రంలో చామన ఛాయలో ఎందుకు చూపించాలనుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కిందిస్థాయి వారు చామని ఛాయ లేదా నల్ల రంగు శరీర వర్ణంతోనే ఉంటారని సినిమాల్లో ఎప్పటికీ మూసధోరణిలోనే చూపిస్తారని సోషియాలజిస్ట్ సంజయ్ శ్రీవాత్సవ అన్నారు.
"స్థాయిలను ఊహించుకునే మూస ధోరణులు.. ప్రకటనలు, సినిమాల వల్లే ఎక్కువయ్యాయి. తెల్లగా ఉండడమే విజయం అన్న భావనను తీసుకొచ్చాయి. దీన్ని నేరమని చాలా మంది భావించడం లేదు. ప్రజలు కూడా దీన్ని ఖండించడం లేదు."
- శ్రీవాత్సవ, సోషియాలజిస్ట్
హృతిక్ రంగు మార్చి చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.
" class="align-text-top noRightClick twitterSection" data=""బిహార్ ప్రజలందరూ బొగ్గు గనుల్లో నివసించట్లేదని అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో చాలా మందికి ముఖం కడుక్కునేందుకు సబ్బులు సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి."
-- సోషల్ మీడియాలో ఓ పీహెచ్డీ విద్యార్థి అసంతృప్తి
putting black makeup on hrithik roshan is kinda racism why don't you just cast a natural dark skinned actor for this role #Super30
— tiwarideepika (@tiwarideepika1) June 6, 2019
">putting black makeup on hrithik roshan is kinda racism why don't you just cast a natural dark skinned actor for this role #Super30
— tiwarideepika (@tiwarideepika1) June 6, 2019
putting black makeup on hrithik roshan is kinda racism why don't you just cast a natural dark skinned actor for this role #Super30
— tiwarideepika (@tiwarideepika1) June 6, 2019