ETV Bharat / sitara

సైకో థ్రిల్లర్​లో 'బఘీరా'గా ప్రభుదేవా - prabhudeva new movie title released

ప్రముఖ కొరియోగ్రాఫర్​, డైరెక్టర్​ ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న చిత్రం 'బఘీరా'. తాజాగా ఈ సినిమా టైటిల్​, తొలిరూపును విడుదల చేసింది చిత్రబృందం. నటుడు ధనుష్​ ట్విట్టర్​ వేదికగా వీటిని అభిమానులతో పంచుకున్నాడు.

prabhudeva
బహీరా
author img

By

Published : Feb 15, 2020, 1:35 PM IST

Updated : Mar 1, 2020, 10:08 AM IST

'త్రిష ఇల్లనా నయనతార' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు 'ఆదిక్‌ రవిచంద్రన్‌'. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి 'బఘీరా' అని పేరు పెట్టాడు. తాజాగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్​ వేదికగా విడుదల చేశాడు హీరో ధనుష్‌.

prabhudeva
బహీరా

"ది జంగిల్‌ బుక్‌ కామిక్‌ కథా చిత్రంలో వచ్చే చిరుత పాత్ర పేరు 'బఘీరా'. ఆ పేరునే ఈ చిత్రానికి పెట్టాం. తొలిరూపు విడుదల చేసిన ధనుష్‌కు కృతజ్ఞతలు. సైకో థ్రిల్లర్‌ కథాంశంతో సినిమా తీస్తున్నాం. ప్రభుదేవా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవలె చిత్రీకరణ పూర్తయింది."

-ఆదిక్‌ రవిచంద్రన్‌, దర్శకుడు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉందీ చిత్రబృందం. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నాడు ఆదిక్​ రవిచంద్రన్​. ఆర్‌వీ బరదన్‌, ఎస్‌వీఆర్‌ రవిశంకర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అనేగన్‌' ఫేమ్‌ అమీరా దస్తర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు గణేశన్‌ శేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు.

prabhudeva
బహీరా

ఇదీ చదవండి: లవర్స్ డే: టాలీవుడ్​లో ప్రేమికుల సినిమా సందడి

Last Updated : Mar 1, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.